నేడు కార్తీక పౌర్ణమి... ముస్తాబైన ధర్మపురి

పంచ సహస్రాధిక దీపాలంకరణకు ఏర్పాట్లు

On
నేడు కార్తీక పౌర్ణమి... ముస్తాబైన ధర్మపురి

నేడు కార్తీక పౌర్ణమి... ముస్తాబైన ధర్మపురిIMG-20241111-WA0009

 (రామ కిష్టయ్య సంగన భట్ల...
   9440595494)

   ధర్మపురి క్షేత్రంలో శుక్రవారం నిర్వహించనున్న కార్తీక పౌర్ణమి వేడుకలకు క్షేత్రం ముస్తాబైంది. సాంప్రదాయ రీతిలో నిర్వహిం చనున్న పర్వదిన వేడుకల సందర్భంగా దేవస్థానం లోని ప్రధానాలయాలైన శ్రీ యోగానంద, ఉగ్ర లక్ష్మీ సమేత నారసింహ, శ్రీ వెంకటేశ్వర, శ్రీ రామ లింగేశ్వ రాలయాలలో ఉదయా త్పూర్వం నుండే పవిత్ర గోదావరి నది జలాలతో అభి షేకాది అర్చనలు, ప్రత్యేక పూజలు జరుప నున్నారు. ప్రధానంగా శ్రీ వేంకటేశ్వర శ్రీ వేణుగోపాల ఆలయాల మధ్య దేవస్థాన ప్రాంగణంలో ఉన్న ఉసిరిక వృక్షాన్ని అలంకరించి, కార్తీక దామోదరున్ని పూజించడం ఆనవాయితీ.

ఉసిరిక చెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేయడం, అసంఖ్యాక మహిళలు గోదావరి నదిలో పవిత్ర మంగళ స్నానాలు ఆచరించి, దొప్పలలో వెలిగించిన కార్తీక దీపాలను నదీ నీటిలో వది లిపెట్టడం, పురాణ శ్రవణం, క్షేత్రంలో అనాదిగా ఆచరిస్తున్న సాంప్రదాయాలు. దేవస్థానం ఈఓ శ్రీనివాస్ పర్యవేక్షణలో, దేవస్థాన వేద పండితులు బొజ్జా రమేశ శర్మ, సంపత్ కుమార శర్మ, సంతోష్ శర్మ, రాజగోపాల్ శర్మ సారధ్యంలో ఆర్చకుల బృందం, సిబ్బంది ప్రత్యేక ఏర్పాట్లు గావిస్తున్నారు.

జగిత్యాల నుండే గాక వివిధ ఆర్టీసి డిపోల నుండి ప్రత్యేక బస్సులను నడిపే ఏర్పాట్లు చేస్తున్నారు. ధర్మపురి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాం నర్సింహా రెడ్డి, ఎస్ఐ, స్థానిక సివిల్, ప్రత్యేక పోలీసుల ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాట్లపై దృష్టి కేంద్రీకరించారు. రద్దీ క్రమబద్దీకరణపై ప్రత్యేక దృష్టి నిలిపి, అందుకు వలసిన ప్రత్యేక ఏర్పాట్లు గావిస్తున్నారు.

పంచ సహస్రాధిక దీపాలంకరణకు ఏర్పాట్లు

కార్తీక పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని శుక్రవారం కార్తీక పౌర్ణమి నాడు సాయంత్రం 5 గంటల నుండి స్థానిక బ్రహ్మ పుష్కరిణి (కోనేరు)లో పంచ సహస్ర (ఐదువేల) దీపాలంకరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించను న్నారు. క్షేత్రంలో ఇటీవలి కాలంలో పంచ సహస్ర దీపాలంకరణ విశేషంగా జరుప బడుతున్న క్రమంలో, ఈ సంవత్సరం మరింత వైభవంగా జరిపేందుకు ఐదు వేల ప్రత్యేక ప్రమిదలు, వస్తువులను సమ కూరుస్తున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు యధోచితంగా వత్తులు, నూనె తీసుకొని వచ్చి పాల్గొనవలసిందిగా దేవస్థానం ఇఓ  శ్రీనివాస్ సంకటాల కోరారు. దేవస్థానం నుండి భక్తుల సహ కారంలో 5000 దీపములు, నూనె సమకూరిందని, వాటితో తగిన ఏర్పాటు చేయ బడుననీ, ఇంకను భక్తులు తాము నేరుగా దీపములు తీసుకొని వచ్చి వెలిగించ వచ్చునని వారు వివరించారు.

వేణుగోపాలునికి ప్రత్యేక పూజలు ధర్మపురి క్షేత్రంలోని, ధర్మపురి దేవస్థానంలోని అలంకృత శ్రీ వేణుగోపాల స్వామి, 
శ్రీలక్ష్మీ నరసింహ దేవస్థానంలోని శ్రీవేణు గోపాల స్వామి ఆలయంలో  ప్రత్యేక పూజాదికాలు నిర్వహించారు. కార్తీక శుద్ధ ఏకాదశి మొదలుకొని పౌర్ణమి వరకు పంచ పర్వాలలోని ఐదు రోజులలో ప్రత్యేక అర్చనలు అభిషేకాలు పూజలు  నిర్వహించడం సాంప్రదాయం కాగా, ధర్మపురి క్షేత్రస్ధ  ఆలయాలలో ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పర్వదిన పూజలను నిర్వహించారు. దేవస్థానం అధికారులు, సిబ్బంది, అర్చకులు, పండితులు భక్తులు పాల్గొన్నారు. ఏర్పాట్లను పర్యవేక్షించారు.

Tags