మూసీకి రూ. లక్షా 50 వేల కోట్లు ఉంటాయి, కానీ రైతులకు రూ.15 వేలు ఇవ్వలేదా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం?? - దావ వసంత సురేష్.

On
మూసీకి రూ. లక్షా 50 వేల కోట్లు ఉంటాయి, కానీ రైతులకు రూ.15 వేలు ఇవ్వలేదా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం?? - దావ వసంత సురేష్.

 

మూసీకి రూ. లక్షా 50 వేల కోట్లు ఉంటాయి, కానీ రైతులకు రూ.15 వేలు ఇవ్వలేదా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం?                                                 - దావ వసంత సురేష్

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల 19 అక్టోబర్ (ప్రజా మంటలు) : 

రైతులకు ఇవ్వాల్సిన వర్షాకాల రైతుభరోసా ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై బిఆర్ఎస్ పార్టీ జగిత్యాల జిల్లా కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొన్న చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ,జగిత్యాల జిల్లా పరిషత్ తొలి చైర్ పర్సన్ దావ వసంతసురేష్...

ఈ సందర్భంగా సుంకే రవిశంకర్ మాట్లాడుతూ...

సాధారణ ఎన్నికల సమయంలో పీసీసీ అధ్యక్షుడుగా ఉన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం రైతు బంధు ద్వారా ఎకరానికి 10000 ఇస్తున్నారని మేము అధికారంలోకి వచ్చిన వెంటనే 15000ఇస్తామని చెప్పారని ఇంకా ఇవ్వడం లేదని రైతు భరోసా ఉన్నట్టా..లేనట్టా ??  వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల మాట్లాడుతూ రైతు భరోసా వేసంగి పంటకు ఇస్తామని పేర్కొనడం విడ్డురంగా ఉందని..

.... రైతు భరోసా కు చీకటి రోజు....

గడిచిన వాన కాలం పంట కోతలకు వచ్చిన రైతు భరోసా ఇవ్వలేక పోయారని..రుణమాఫీ ఆగష్టు 15లోపల చేస్తామని,సీఎం 40లక్షల కోట్లు మాఫీ చేశామని, వ్యవసాయ శాఖమంత్రి, ఇతర మంత్రులు ఒకరి మాటకు ఒకరికి పొంతన లేకుండా మాట్లాడుతున్నారని...కేసీఆర్ రుణమాఫీ,నాట్లు వేయడానికి ముందు రైతు బంధు,రైతు మరణిస్తే 5లక్షల రైతు బీమా, సకాలంలో ఎరువులు అందజేశారని..కేసీఆర్ ధాన్యం కొనుగోలు విషయంలో సంబంధిత మంత్రులతో, ఎమ్మెల్యే,కలెక్టర్ల తో సమీక్షా సమావేశము ఏర్పాటు చేసి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు,గన్ని బ్యాగ్ లు అందుబాటులో ఉంచడం జరిగిందని...

ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు నడ్డి విరిచే ప్రభుత్వం....

రైతుల నోట్లో మట్టి కొడుతుందని స్కామ్ ప్రభుత్వం..

ఢిల్లీకి మూటలు పంపే ప్రభుత్వం..6గ్యారంటీల అమలు లో విఫలం 

కళ్యాణలక్ష్మి కి అదనంగా తులం బంగారం, మహాలక్ష్మి 2500 పింఛన్ ఏమైందని ఏద్దేవా చేశారు.

ఈ సందర్భంగా దావ వసంతసురేష్  మాట్లాడుతూ....

ఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా ఇవ్వలేమని మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు గారు చావు కబురు చల్లగా చెప్పిండు.

దేశానికి అన్నం పెట్టే రైతన్న ఓట్లను ఎన్నికల సమయంలో వాడుకొని ఏర్పడ్డది ఈ నీచమైన కాంగ్రెస్ ప్రభుత్వం మూసీకి రూ. లక్షా 50 వేల కోట్లు ఉంటాయి,కానీ రైతులకు రూ.15 వేలు ఇవ్వలేవా?

బిఆర్ఎస్ పార్టీ కెసిఆర్ నాయకత్వంలో మేమందరం రైతులందరికీ రైతుభరోసా వచ్చేంతవరకు రైతుల పక్షాన పోరాడుతాం. 

రైతు బంధును రైతు భరోసాగా పేరు మార్చారు తప్ప ఎక్కడా మార్పు రాలేదన్నారు.

అమలు గాని హామీలతో గద్దెనెక్కిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలలో ఏ ఒక్క వర్గానికి హామీల అమలు కాలేదన్నారు

కెసిఆర్ గారిని కాదని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఇవ్వాల రైతన్ననే కాలదన్నె గడ్డు పరిస్థితి ఎవరి ద్వారా వచ్చిందో ఒకసారి రైతులందరు గమనించు కోవాలన్నారు.

రైతు పక్షపాతి రేవంత్ రెడ్డి అని పార్టీ మారిన ఎమ్మెల్యేలు కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులను అడుగడుగున ప్రతి గ్రామంలో నిలదీయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు

పది సంవత్సరాల బిఆర్ఎస్ పార్టీ కెసిఆర్ పాలనలో జగిత్యాల జిల్లాగా ఏర్పడి మెడికల్ కాలేజీ స్థాపన అనేక అభివృద్ధి కార్యక్రమాలతో ప్రథమ స్థానంలో జగిత్యాల జిల్లా నిలిచింది అంటే కెసిఆర్ గారి వల్లే సాధ్యమైందన్నారు..

ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షుడు గట్టు సతీష్, బిఆర్ఎస్ పట్టణ ఉపాధ్యక్షుడు వొల్లెం మల్లేశం,ఆయిల్నేని వెంకటేశ్వర్ రావు,మజాహిర్ రిజ్వాన్ తదితరులు పాల్గొన్నారు..

Tags