అంగన్వాడి సెంటర్ ను   అకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్  బి,సత్యప్రసాద్

On
అంగన్వాడి సెంటర్ ను   అకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్  బి,సత్యప్రసాద్

అంగన్వాడి సెంటర్ ను 
 అకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్  బి,సత్యప్రసాద్

గొల్లపల్లి సెప్టెంబరు 24 (ప్రజా మంటలు): 

గొల్లపల్లి మండలంలోని చిల్వకోడూరు అంగన్ వాడి సెంటర్ ను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. 
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలకు సంబంధించిన రిజిస్టర్ నమోదు చేస్తున్నారా లేదా అని పరిశీలించారు. 0-6 సంవత్సరాల వయస్సు గల పిల్లలు ఎంతమంది ఉన్నారు, వారు రోజు వస్తున్నారా అని వారి అటెండెన్స్ వివరాలను కలెక్టర్ చెక్ చేశారు. రోజు వారికి ఇచ్చే ఆహార మెనూను, వయస్సుకు తగ్గట్టుగా పొడవు, బరువు ఉన్నారా, వారికి దేనికి సంబంధించిన ప్రోటీన్స్ ఆహారం ఇస్తున్నారు, బరువు తక్కువగా ఉన్న వారికి బాలామృతం ఇస్తున్నారా లేదా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అలాగే టాయిలెట్స్ ను ఎప్పటికప్పడు శానిటేషన్ చేయించాలని కలెక్టర్ సూచించారు. అంగన్ వాడి సెంటర్లో గర్భిణీలు, బాలింతలు ఎంతమంది ఉన్నారు, వారికి సంబంధించిన వివరాలను, వారికి పంపిణీ చేసే ప్రోటీన్స్ గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. 
కలెక్టర్ వెంట జిల్లా సంక్షేమ శాఖ అధికారి నరేష్,బి.సి. వెల్ఫేర్ ఆఫీసర్ సాయిబాబా, తాసిల్దార్ జమీరోద్దీన్, ఎంపీడీవోరామ్ రెడ్డి, అంగన్వాడి   టీచర్స్ సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Tags