నివేషణ స్థలాలకై ఉద్యమ బాట పట్టనున్న కలం వీరులు

On
నివేషణ స్థలాలకై ఉద్యమ బాట పట్టనున్న కలం వీరులు

నివేషణ స్థలాలకై ఉద్యమ బాట పట్టనున్న కలం వీరులు
జగిత్యాల జులై 26 (ప్రజామంటలు) : 
సొంతగూడు కోసం స్థానిక విలేకరులు గత కొన్ని సంవత్సరాలుగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా రేపు మాపు అంటూ ప్రజా ప్రతినిధులు మాటలతోనే కాలం వెళ్లబుచ్చుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. విలేకరులకు గతంలో పలు స్థలాల్లో నివాస స్థలాలకై చూపడం తిరిగి ఆ స్థలాలను వేరే వాటికి కేటాయించడం ఒక ప్రహసనంగా మారింది. ఇదిలా ఉండగా ధరూర్ క్యాంపులోని ఓ స్థలము ఖరారు చేసి విలేకరులకు ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది. కాగా ఆ స్థలం ఇప్పుడు ఐటిఐ కోసం ప్రతిపాదనలు పంపడంతో విలేకరుల ఆశల మీద చన్నీళ్లు చల్లినట్లు అయింది. ప్రస్తుత ప్రభుత్వం విలేకరులకు నివేషణ స్థలాలు ఇవ్వాలని ఉన్నప్పటికీ స్థానికంగా సరియైన స్థలం లభ్యం కాకపోవడంతో విలేకరులు శుక్రవారం సమావేశమై ప్రజా ప్రతినిధులను కలిసి వినతి పత్రాలతో తమ గోడు వెళ్ళబుచ్చుకోవాలని తీర్మానించుకున్నారు. నివేషణ స్థలాలు పొందే వరకు వివిధ రూపాల్లో తమ ఆకాంక్షల్ని కార్యరూపం తాలుస్తామని నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్టులు,  ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు పాల్గొన్నారు.
Tags