మేదిని కళాక్షేత్రం వారి తెలంగాణ బోనాలు ప్రారంభించిన చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్
మేదిని కళాక్షేత్రం వారి తెలంగాణ బోనాలు ప్రారంభించిన చైర్పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్
జగిత్యాల జులై 12 (ప్రజా మంటలు) :
మేదిని కళాక్షేత్రం జగిత్యాల వారి ఆధ్వర్యంలో తెలంగాణ బోనాల పండుగలో పాల్గొని, జ్యోతి ప్రజ్వలనతో మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ కార్యక్రమం ప్రారంభించారు.
తెలంగాణలో కలలు కళాకారులను ప్రోత్సహించేందుకు మేము ఎప్పుడు ముందుంటామని అన్నారు.
నేటి సమాజంలో సంగీత నాటక రంగాలకు అంతరించిపోతున్నాయని ఇలాంటి నృత్య కళాక్షేత్రాలను తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహించి పంపించాలని అన్నారు.
యువత పెడదారి పట్టకుండా కలల పట్ల మక్కువ ఉండేలాగా చూడాలని తల్లిదండ్రుల ప్రోత్సాహంతోనే పిల్లలు ఉన్నత శిఖరాలు అదిరోహిస్తారని తల్లిదండ్రుల ప్రోత్సాహంతో మాత్రమే పిల్లలు ఉన్నతవంతులుగా తీర్చిదిద్దగలుగుతారని అన్నారు.
తల్లిదండ్రుల ప్రోత్సాహం గురువుల సహకారంతో పిల్లలు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ప్రతి ఒక్క నృత్య కళాకారునిలకు ప్రత్యేక అభినందనలు అన్నారు.
ఈ కార్యక్రమంలో మేదిని కళాక్షేత్రం నాట్యాచార్యులు బొమ్మిడి నరేష్ కుమార్ నాట్య విజ్ఞాన్ నాట్యగురువులు మేదిని భుజంగ రావు డాన్స్ మాస్టర్ రాజేష్ సతీష్ మల్యాల నృత్య విద్యార్థినుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.