ప్రతి జ్వరానికి డెంగ్యూ పరీక్షలు నిర్వహించాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

On
ప్రతి జ్వరానికి డెంగ్యూ పరీక్షలు నిర్వహించాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

ప్రతి జ్వరానికి డెంగ్యూ పరీక్షలు నిర్వహించాలి జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్
జగిత్యాల జూలై 8 (ప్రజా మంటలు) :

 మలేరియా, డెంగ్యూ మరియు కలరా వ్యాధుల పై జిల్లాస్థాయి  సమన్వయ సమావేశం జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్   జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వివిధ శాఖల యొక్క పాత్ర మరియు బాధ్యతల గురించి అడిగి తెలుసుకున్నారు.  ప్రతి జ్వరముకు డెంగ్యూ పరీక్షలు నిర్వహించాలని, జిల్లాలో రాపిడ్ టెస్టింగ్ కిట్ల గురించి పూర్తి సమాచారం ఇవ్వాలని తెలిపారు.  ఆరోగ్య సిబ్బంది పట్టణ ప్రాంతాలలో ప్రతి ఇంటిని విధిగా సందర్శించి దోమలు పెరగడానికి ఆస్కారం ఉన్నటువంటి ప్రదేశాలను గుర్తించి వాటిని నిర్మూలిచ్చేటువంటి సూచనలు చేశారు.  అది నివాసం పెరిగే ప్రదేశాల గురించి విధిగా ప్రచారం చేయండి అవగాహన కల్పించాలి, కేవలం ప్రభుత్వ ఆసుపత్రులలో ఉన్న డెంగ్యూ జ్వరాలనే కాకుండా ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నటువంటి కేసులు కూడా ప్రతిరోజు నమోదు  చేస్తూ అట్టి వివరాలను తెలియజేయాలని తద్వారా శాఖల యొక్క సహకారంతో వ్యాధి వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన నివారణ చర్యల గురించి తగిన చర్యలు చెప్పడానికి వీలవుతుందని తెలిపారు అదే మాదిరిగా జిల్లాలో గుర్తించినటువంటి 38 హైరిస్ కెరియర్స్ ని యొక్క వివరాలను సంబంధిత అన్ని శాఖలకు సమాచారం అందించవలసిందిగా తెలియజేస్తున్నారు దాంతో పాటుగా దోమల అభివృద్ధి చెందడానికి ఆస్కారం ఉన్నటువంటి వాటర్ స్థానిక పాంట్స్ ని నీటిని ఉన్నటువంటి ప్రదేశాలను గుర్తించడం వాటిని తొలగించడం ఒక విధంగా తొలగించడానికి  ఆయిల్ బాల్స్ వేయడం  చేయాలని, ఆయా గ్రామాల్లో పట్టణంలో గాని తాళం వేసి ఉన్నటువంటి ఇండ్లను గుర్తించడం ఆయా పరిసరాలలో దోమలను ఉండేటటువంటి ఆస్కారం ఉన్నటువంటి ప్రదేశాలను గుర్తించి వాటిని తొలగించడం శిథిలావస్థకు వచ్చినటువంటి గృహాలను గుర్తించి వాటిలో వృద్ధి చెందడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది కాబట్టి వాటిని తొలగించడం వంటివి చేయాలని తెలిపారు. అన్ని పట్టణాల కమిషనర్ వారి వారి పరిధిలో ఉన్నటువంటి ఐరిస్ ఏరియాస్ ని పంపడానికి ఆస్కారం ఉన్నటువంటి ప్రాంతాలను గుర్తించి తెగిన చర్ల చేపట్టాలని సూచించడం జరిగినది లోతట్టు ప్రాంతాలు ఉండే ప్రదేశాలు వాటి పైన ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించడం జరిగింది ప్రతి వార్డులో ఫాగింగ్ చేయడము ద్వారా దోమల అభివృద్ధి నివారించాలని తెలియజేశారు. వైద్యాధికారులు పరిధిలో ఉన్నటువంటి అన్ని ఆశ్రమ పాఠశాలను విధిగా సందర్శించి వాటి వివరాలు ఎప్పటికప్పుడు తెలియజేయాలని కోరారు. వాటి వల్ల రవాణా సంబంధాలు తెగిపోయేటువంటి గ్రామాలను గుర్తించి ఆయా గ్రామాల లోపల ఎవరైనా గదిలో ఉన్నట్టయితే వారిని ప్రసవానికి సమీపంలో ఉన్నటువంటి గర్భిణులను గుర్తించి వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించవలసిందిగా తెలిపారు. జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపర్డెంట్ ను ప్రతిరోజు వారి వద్దకు వచ్చేటువంటి వారిని డెంగ్యూ టెస్ట్ నిర్వహించి వారి ఆ వివరాలను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి నివేదికలు పంపాలని తెలిపారు.
  జిల్లాలోని ప్రతి ప్రైవేట్ ఆసుపత్రి మరియు ఆసుపత్రి లో ఉన్నటువంటి బాధపడుతున్నటువంటి రోగుల యొక్క వివరాలను నమోదు చేయుటకు ప్రత్యేకమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేయాలని సూచించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రఘువరన్, వివిధ శాఖల  జిల్లా అధికారులు, వైద్య అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Tags