సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్  *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

On
సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం గ్రేట్  *మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని

WhatsApp Image 2025-04-01 at 7.23.16 PM *15 ఏండ్లుగా ప్రతి వేసవిలో అన్నదానం, చలివేంద్రం
 *ఆదర్శంగా శ్రీనివాస సమాజ సేవ ఛారిటబుల్ట్రస్ట్
 
సికింద్రాబాద్, ఏప్రిల్ 01 (ప్రజామంటలు) :
 
వయస్సు పైబడిన కూడ పేద ప్రజలకు సేవ చేయాలనే సీనియర్ సిటిజన్స్ సంకల్పం చాల గొప్పదని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం సనత్ నగర్ లోని బీకే గూడ పార్క్ వద్ద శ్రీనివాస సమాజ సేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మధ్యాహ్న మిత బోజన పంపిణీ, చలివేంద్రం లను ఆయన ప్రారంభించారు. నేటి నుండి  రెండు నెలల పాటు ఈ కేంద్రాలు కొనసాగుతాయని నిర్వహకులు వివరించారు. పలువురికి భోజనం వడ్డించడమే కాకుండా ఆయన కూడా భోజనం చేసి ఎంతో రుచికరంగా, నాణ్యతతో బోజనాన్ని ఉచితంగా వడ్డిస్తూ అనేకమంది ఆకలి తీరుస్తున్న నిర్వహకులను అభినందించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ.. గత 15 సంవత్సరాల నుండి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ఆర్గనైజర్లను అభినందించారు. 
 
నిత్యం 250 మందికి....రెండు నెలల పాటు..
 
రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి పార్థసారథి తమ శ్రీనివాస సమాజ సేవ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ప్రతి ఏడాది వేసవిలో ఆకలితో ఉన్న వారికి అన్నదానం చేయాలని నిర్ణయించుకొని, 15 ఏండ్ల క్రితం ఈ సేవ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 65 నుండి 95 సంవత్సరాల వయసు కలిగిన 170 మంది సీనియర్ సిటిజన్స్ కౌన్సిల్ గా ఏర్పడి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ప్రతి వేసవిలో  రెండు నెలల మండు టెండల కాలం పాటు ప్రత్యేక టెంట్ వేసి, నిత్యం 250 మందికి అన్నదానం నిర్వహిస్తున్నారు. ఇంట్లో వండిన మాదిరిగానే రెండు కూరలు, సాంబారు, మిర్చిబజ్జి, పెరుగు, తదితర పదార్థాలతో రుచికరంగా వంటలు చేస్తూ బోజనం పెడుతున్నారు. అలాగే ఇక్కడే చలివేంద్రాన్ని కూడ ఏర్పాటు చేశారు. అయితే ఈ రెండు నెలల పాటు ప్రతి రోజు ఒక దాత ముందుకొచ్చి, అన్నదానం ఖర్చును భరిస్తారు. తమ పుట్టిన రోజు,తమ వారి జ్ఞాపకార్థం, ఇలా పలు రకాల విశేషమైన రోజుల సందర్బంగా  తమకు నచ్చిన ఒక రోజును ఎంపిక చేసుకొన్న దాతలు ఆ రోజున అన్నదానం  స్పాన్సర్ చేస్తున్నారు. పేద విద్యార్ధులకు ఉచితంగా నోట్ బుక్స్ పంపిణీ, హెల్త్ క్యాంప్ ల నిర్వహణ వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తమ వయస్సును సైతం లెక్క చేయకుండా సేవా కార్యక్రమాలను నిరంతరాయంగా నిర్వహిస్తున్న సీనియర్ సిటిజన్స్ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నారు. సీనియర్ సిటిజన్స్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు తన వంతు సాయం ఎప్పటికీ ఉంటుందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసయాదవ్ హామినిచ్చారు. సీనియర్ సిటిజన్స్ తమ ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. సేవా కార్యక్రమాల్లో ఎంతో చురుకుగా పాల్గొనే కౌన్సిల్ లోని పలువురు సభ్యులు కరోనా సమయంలో మరణించారని, వారు గుర్తుకొచ్చినప్పుడు తన మనసుకు ఎంతో బాధ కలుగుతుందన్నారు. 
 ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నామన శేషుకుమారి, సనత్ నగర్, అమీర్ పేట డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అద్యక్షులు కొలన్ బాల్ రెడ్డి, హన్మంతరావు, నాయకులు అశోక్ యాదవ్, డాక్టర్ లు సుష్మ, ప్రియాంక, సీనియర్ సిటిజన్ కౌన్సిల్ అద్యక్షుడు దూబే, మాజీ అద్యక్షులు మాణిక్ రావ్ పాటిల్, సభ్యులు సహదేవ్ గౌడ్, కృష్ణ దేవ్ గౌడ్, కృష్ణా రెడ్డి, జె.ప్రసాద్, శంకర్, రామలింగం, అనంతరెడ్డి, నాయకులు కర్ణాకర్ రెడ్డి, ఖలీల్, గోపిలాల్ చౌహాన్, కూతురు నర్సింహ, బలరాం పాల్గొన్నారు.

 

Tags

More News...

Local News 

పోలీసు అధికారులు  మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమన్వయo  తో పనిచేయాలి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

పోలీసు అధికారులు  మరియు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమన్వయo  తో పనిచేయాలి జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల ఏప్రిల్ 3 (ప్రజా మంటలు)పోలీస్ అధికారులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు సమన్వయంతో  పనిచేస్తూ నేరస్థులకు ఖచ్చితంగా శిక్ష పడేవిధంగా చేయడం ద్వారానే బాధితులకు సరైన న్యాయం జరుగుతుందని జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్  అన్నారు. జిల్లా పోలీస్ ప్రదాన కార్యాలయంలో నిందితులకు శిక్షపడుటలో పోలీసులు తీసుకోవలసిన చర్యల గురించి ఎపిపి రజని  ప్రత్యేక...
Read More...
Local News 

ప్రయాణం మరింత సురక్షితం – రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసుల ప్రత్యేక చర్యలు

ప్రయాణం మరింత సురక్షితం – రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీసుల ప్రత్యేక చర్యలు   జగిత్యాల ఏప్రిల్ 3 (ప్రజా మంటలు) ట్రాఫిక్ నియంత్రణ భద్రత సామాగ్రి, బ్రీత్ అనలైజర్ పరికరాలు పోలీస్ స్టేషన్లకు అందించిన జిల్లా ఎస్పీ  రోడ్డు ప్రమాదాలను నియంత్రించడంలో, ట్రాఫిక్ నియమాలను మరింత పకడ్బందీ గా అమలుపరుచటకు రాష్ట్ర డిజిపి కార్యాలయం నుంచి వచ్చిన అధునాతన పరికరాలు  ఫ్లెక్సబుల్ ఐరన్ బారికేడ్స్ , ట్రాఫిక్ కోన్స్,రిఫ్లెక్ట్ జాకెట్స్,...
Read More...
Local News 

దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శం..... అదనపు కలెక్టర్ బి. ఎస్ లత.

దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శం..... అదనపు కలెక్టర్ బి. ఎస్ లత.    జగిత్యాల, ఏప్రిల్ -03( ప్రజా మంటలు)దొడ్డి కొమురయ్య పోరాట స్ఫూర్తి మనందరికీ ఆదర్శమని అదనపు కలెక్టర్ బి. ఎస్. లత తెలిపారు.  గురువారం అదనపు కలెక్టర్ బి. ఎస్ లత సమీకృత జిల్లా కలెక్టరేట్ లో నిర్వహించిన దొడ్డి కొమురయ్య 98వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ బి. ఎస్...
Read More...
Local News 

నల్ల మట్టిని తరలిస్తున్న మూడు టిప్పర్లను పట్టుకున్న రెవెన్యూ సిబ్బంది, 

నల్ల మట్టిని తరలిస్తున్న మూడు టిప్పర్లను పట్టుకున్న రెవెన్యూ సిబ్బంది,  ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 3( ప్రజా మంటలు దగ్గుల అశోక్): జగిత్యాల జిల్లా ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని  మూలా రాంపూర్  గ్రామము నుండి ఎలాంటి అనుమతి లేకుండా నల్ల మట్టి రవాణా చేస్తున్నా మూడు టీప్పర్లను గురువారం రోజున సాయంత్రం ఎర్దాండి గ్రామము చీవర్లో రెవెన్యూ సిబ్బంది  పట్టుకొన్నారు. తాహసిల్దార్ ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇట్టి వాహనాలను...
Read More...
Local News 

మూల్యాంకన భత్యాలు వెంటనే అందేలా చర్యలు తీసుకుంటాం- అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత

మూల్యాంకన భత్యాలు వెంటనే అందేలా చర్యలు తీసుకుంటాం- అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత జగిత్యాల ఎప్రిల్ 03:   జిల్లాలో పదవ తరగతి మూల్యాంకానానికి సంబంధించిన రెండు సంవత్సరాల గౌరవభత్యాలను (2022.23, 2023.24) వెంటనే అందేలా చర్యలు తీసుకుంటున్నామని అదనపు కలెక్టర్ బిఎస్ లత తెలిపారు. గురువారం తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం తపస్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో జిల్లాలోని ఉపాధ్యాయులకు పదవ తరగతి మూల్యాంకన భత్యాలు వెంటనే అందేలా చర్యలు...
Read More...
Local News 

పద్మారావు నగర్లో అకాల వర్షం...అంతా అతాలకుతలం..

 పద్మారావు నగర్లో  అకాల వర్షం...అంతా అతాలకుతలం.. *సెల్లార్లలోకి వర్షపునీరు..మునిగిన బైకులు..*చెరువుల్లాగా మారిన రోడ్లు*ఇండ్లల్లోకి చేరిన వాన నీరు*వెంకటాపురం కాలనీలో కూలిన ప్రహరీ సికింద్రాబాద్ ఏప్రిల్ 03 (ప్రజామంటలు): సిటీలో మద్యాహ్నం కురిసిన అకాల వర్షానికి అంతా అతలాకుతలం అయింది. ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. బన్సీలాల్ పేట డివిజన్ పద్మారావునగర్ వెంకటపురం కాలనీలో నూతనంగా నిర్మిస్తున్న తుంగభద్ర...
Read More...
Local News 

జగిత్యాల సూర్య గ్లోబల్‌లో...అలరించిన సంస్కృతి,  నాగరికత ప్రదర్శన...

జగిత్యాల సూర్య గ్లోబల్‌లో...అలరించిన సంస్కృతి,  నాగరికత ప్రదర్శన... ప్రదర్శన ప్రారంభించిన జిల్లా విద్యాధికారి రాము జగిత్యాల ఎప్రిల్ 03:   సూర్య గ్లోబల్ స్కూల్ లోనిర్వహించిన దేశ ప్రగతికి పట్టుగొమ్మలుగా నిలిచే సంస్కృతి, నాగరికత అంశాల ప్రదర్శనతో చిన్నారులు అలరించారు.   జగిత్యాల జిల్లా కేంద్రంలోని సూర్యా గ్లోబల్‌ స్కూల్‌ లో గురువారం విద్యార్థులు భారతీయ సంస్కృతి-నాగరికతల వైభవాన్ని కండ్లకు కట్టేలా పలు అంశాలను ప్రదర్శింపజేసి భిన్నత్వంలో...
Read More...
Local News 

జగిత్యాల - కరీంనగర్ ప్రధాన రహదారి ని 4 లేన్ల రహదారిగా విస్తరించాలని మాజీ కౌన్సిలర్ జయశ్రీ లేఖ

జగిత్యాల - కరీంనగర్ ప్రధాన రహదారి ని 4 లేన్ల రహదారిగా విస్తరించాలని మాజీ కౌన్సిలర్ జయశ్రీ లేఖ జగిత్యాల ఎప్రిల్ 03: జగిత్యాల - కరీంనగర్ ప్రధాన రహదారి ని 4 లేన్ల రహదారిగా విస్తరించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కు  జగిత్యాల పట్టణ 35 వ వార్డు మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ లేఖ రాసారు. జగిత్యాల నుండి కరీంనగర్ నేషనల్ హైవే "563" నాలుగు లైన్ల రహదారి గురించి జగిత్యాల...
Read More...
Local News 

దొడ్డి కొమురయ్య విగ్రహానికి నివాళులు 

దొడ్డి కొమురయ్య విగ్రహానికి నివాళులు  మెటుపల్లి ఎప్రిల్ 03: మెటుపల్లిలో దొడ్డి కొమురయ్య  90 వ జయంతి కార్యక్రమంలో మాజీ జిల్లాపరిషత్ ఛైర్పర్సన్ తుల ఉమ, తుల రాజేందర్ లు పాల్గొన్నారు. తుల ఉమ మాట్లాడుతూ మాట్లాడుతూ...సాయుధ పోరాటం లో పాల్గొని అప్పటి పెట్టుబడి దారుల వర్గాలకు భూస్వామి వర్గాలకు వ్యతిరేకంగా రైతు కూలీలతో సంఘటితంగా ఉద్యమాన్ని ఏర్పాటు చేసుకొని ముందుకు...
Read More...
Local News 

కేంద్ర మంత్రివర్గం నుండి అమిత్ షా ను బర్తరఫ్ చేయాలి -అడ్లూరి లక్ష్మణ్ కుమార్

కేంద్ర మంత్రివర్గం నుండి అమిత్ షా ను బర్తరఫ్ చేయాలి -అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గొల్లపల్లి ఎప్రిల్ 03 (ప్రజా మంటలు): జై బాపు- జై భీమ్ -జై సంవిధాన్ పాదయాత్రలో భాగంగా గురువారం  పెగడపెల్లి మండలం నంచర్ల నుండి దేవికొండ మీదుగా ల్యాగలమర్రి వరకు నిర్వహించిన పాదయాత్రలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్  పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ.గత కొన్ని రోజుల క్రితం పార్లమెంట్లో కేంద్ర మంత్రి...
Read More...
Local News 

రామ కథా శ్రవణం... ముక్తి దాయకం - డాక్టర్ సంగన భట్ల నరసయ్య

రామ కథా శ్రవణం... ముక్తి దాయకం - డాక్టర్ సంగన భట్ల నరసయ్య   (రామ కిష్టయ్య సంగన భట్ల, సీనియర్ ఇండిపెండెంట్ జర్నలిస్ట్, కాలమిస్ట్) శ్రీ సీతా రామ కథా శ్రవణం ముక్తి దాయకమని, లబ్దప్రతిష్టులైన సాహితీ వేత్త, చారిత్రక సాహిత్య పరిశోధకులు, సంస్కృతాంధ్ర భాషా పండితులు, ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ నాట్య మండలి అధ్యక్షులు, సంగీతజ్ఞుులు, పౌరాణిక నాటక నటులు, ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ ప్రాచ్య...
Read More...
Local News 

కేంద్ర ప్రభుత్వ పెన్షన్ విధానం నిరసిస్తూ బిఎస్ఎన్ఎల్  కార్యాలయం ముందు నిరసన తెలియజేసిన  పెన్షనర్ ఉద్యోగులు..

కేంద్ర ప్రభుత్వ పెన్షన్ విధానం నిరసిస్తూ బిఎస్ఎన్ఎల్  కార్యాలయం ముందు నిరసన తెలియజేసిన  పెన్షనర్ ఉద్యోగులు.. జగిత్యాల ఏప్రిల్ 3 (ప్రజా మంటలు)కేంద్ర ప్రభుత్వ పెన్షన్ వ్యతిరేఖ విధానాలను వ్యతిరేకంగా బి ఎస్ఎన్ ఎల్ కార్యాలయం ముందు నిరసన తెలియజేసిన రిటైర్డ్ పెన్షనర్ ఉద్యోగలు.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన 2025 బడ్జెట్ లో ఆమోదించబడ్డ పెన్షనర్ల సవరణ బిల్లుతో పెన్షనర్లకు, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు...
Read More...