ఘనంగా సూర్య నారాయణ స్వామి కళ్యాణ వేడుకలు.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349494/9348422113).
జగిత్యాల ఫిబ్రవరి 4( ప్రజా మంటలు ) :
చింతకుంట చెరువు సమీపంలోని సూర్య భగవాన్ ధనలక్ష్మి,సహిత ధన్వంతరి దేవాలయంలో రథసప్తమి వేడుకలలో భాగంగా పద్మిని,ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి కళ్యాణం, అంగరంగ వైభవంగా జరిగింది.
ఉదయం సూర్యనారాయణ స్వామికి క్షీరాభిషేకం, ఫల పంచామృత అభిషేకం, మంత్రపుష్పం, అవభృ త స్నానం, పుణ్యాహ వచనం, కళ్యాణం,అనంతరం అన్నదానం జరిగింది.
ఈనాటి కార్యక్రమాన్ని ఆలయ అర్చకులు చిలుక ముక్కు నాగరాజు ఆచార్య, విష్ణు ఆచార్య, కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఫౌండర్ డాక్టర్ రాజన్న, అధ్యక్షుడు పాలితెపు శంకర్, సామాజిక కార్యకర్త తవుటు రామచంద్రం, డాక్టర్ ధనుంజయ, గరి పల్లి ప్రవీణ్ కుమార్, వడ్ల కట్ట శంకర్,విద్యాసాగర్ రావు,సిరిపురం గంగాధర్,డాక్టర్ నాగరాజు,వెంకట్ రాజాం, గిరి నాగభూషణం, రామలింగారెడ్డి, విజయ కుమార్ గుప్తా,చెట్ల చంద్రశేఖర్, పాల్తేపు అ రుణ, వి. సత్యవతి, 🇺🇾 టి.శ్రీదేవి, లత, వడ్లగట్ట స్వాతి, తదితరులు పాల్గొన్నారు.