సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీచే బహుమతుల ప్రధానం
సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీచే బహుమతుల ప్రధానం
హన్మకొండ ఫిబ్రవరి 04:
చిన్నారుల్లో ఉన్న కళలను ప్రోత్సహించడానికై, సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ ప్రతి నెల నిర్వహించే డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తుంది.అందులో భాగంగా "సంక్రాంతి పండుగ" అంశం తో నిర్వహించారు.
పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుపొందిన వారికి బహుమతులు అంది,స్తూ చిన్నారుల్లో ఉన్న కళల్ని తల్లిదండ్రులు ప్రోత్సహించాలని, చదువు మాత్రమే కాకుండా ఇతర నైపుణ్యాలను వారిలో పెంపొందించాలని... చిన్నారుల్లో చిత్ర కళను గుర్తించి పదును పెడుతున్న సాగంటి మంజులకు అభినందిస్తున్నాను అని జిల్లా గ్రంథాలయాల చైర్మన్ మహ్మద్ అజీజ్ ఖాన్ అన్నారు..జిల్లా కేంద్ర గ్రంథాలయం లో జరిగిన బహుమతుల ప్రధానోత్సవ కార్యక్రమం లో పాల్గొని చిన్నారులను అభినందించారు.
ఇందులో సంస్థ డైరెక్టర్ సాగంటి మంజుల తో పాటు కాంగ్రెస్ లీడర్ కందుల సృజన్ కాంత్, పాటు సంస్థ చీఫ్ అడ్వైజర్ నిమ్మల శ్రీనివాస్, రాజేష్, శివ, పిల్లలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు...