కొండపోచమ్మ సాగర్ లో మునిగి 5గురు యువకుల మృతి
కొండపోచమ్మ సాగర్ లో మునిగి 5గురు యువకుల మృతి
సంఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా
ఎమ్మెల్సీ కవిత సంతాపం
సిద్దిపేట జనవరి 11:మ
మర్కుక్ మండలంలోని కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టును సందర్శించడానికి వచ్చిన ఏడుగురు యువకులలో ముషీరాబాద్కు చెందిన 5గురు యువకులు డామ్లో పడి మృతి చెందారు.
సెల్ఫీ కోసం డ్యామ్ లోకి దిగిన యువకులు
ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని ఏడుగురు డ్యామ్ లోకి దిగారు. ఐదుగురు వ్యక్తులు నీటిలోనే మునిగారు.మిగిలిన ఇద్దరూ యువకులు ప్రాణాలతో బయటపడ్డారు
మృతుల పేర్లు
1.ధనుష్ (20) వృత్తి ఫోటో స్టూడియో
2 లోహిత్(17) విద్యార్థి
3 చీకట్ల ధనేశ్వర్(17) విద్యార్థి
4 సాహిల్(19)
5 జాతిన్ (17) విద్యార్థి
సంఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా
కోమరి మృగంక్ (17) విద్యార్థి,ఎండి ఇబ్రహీం(17) బతికి బయట పడ్డారు.
కొండపోచమ్మలో యువకుల గల్లంతు ఘటనపై సీఎం ఆరా తీసి,అధికారులను చేసిన సీఎం రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు.జిల్లా అధికారులు దగ్గరుండి పర్యవేక్షించాలని ఆదేశించారు.
ఎమ్మెల్సీ కవిత సంతాపం
కొండపోచమ్మ సాగర్ లో గల్లంతై హైదరాబాద్ కు చెందిన ఐదుగురు యువకులు మృతి చెందడం పట్ల బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఇలాంటి దురదృష్టకర సంఘటనలు జరగకుండా ఉండేందుకు జలాశయాల వద్ద పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.