పహాడి హన్మాన్ ఆలయ నూతన కమిటీ ప్రమాణస్వీకారం
పహాడి హన్మాన్ ఆలయ నూతన కమిటీ ప్రమాణస్వీకారం
సికింద్రాబాద్ ఫిబ్రవరి 04 (ప్రజామంటలు):
సికింద్రాబాద్ తుకారం గేట్ లో నెలకొని ఉన్న శ్రీ పహాడి హనుమాన్ దేవాలయ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం మంగళవారం ఉదయం శ్రీ పహాడ్ హనుమాన్ దేవాలయంలో జరిగింది. నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఆదం భరత్ కుమార్, ఆదం సుజన్, అండాలు సికింద్రాబాద్ ఇన్స్పెక్టర్, ఆలయ ఈవో రవికాంత్ శర్మ, ఆధ్వర్యంలో నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జరిగింది. ప్రమాణ స్వీకారం అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు భాష్యం వెంకటరమణచార్యులు ఆలయ ఎక్స్ అఫీషియో మెంబర్ నూతనంగా ఎన్నికైన చైర్మన్ మేకల లక్ష్మణ ప్రసాద్ కు , కమిటీ మెంబర్లు ఎల్ మూర్తి , విష్ణు ప్రకాష్ , విటల్ రావు , సంతోష్ కుమార్, లలిత్ కుమార్, భాష్యం వెంకటరమణచార్యులు ఆలయ ప్రధాన అర్చకులు ఎక్స్ అఫిషియో మెంబర్ ఆలయంలో పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు, శేషా వస్త్రాలు అందజేశారు. ఆలయ కమిటీ ప్రమాణస్వీకారం అనంతరం, ఆలయ కమిటీ చైర్మన్ గా మేకల లక్ష్మణ ప్రసాద్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ప్రమాణస్వీకారం చైర్మన్ మేకల లక్ష్మణ ప్రసాద్ మాట్లాడుతూ... ఆలయ అభివృద్ధి లక్ష్యంగా తమ కమిటీ పని చేస్తారు అని అన్నారు. ఆలయంలో అనేక సమస్యలున్నాయని, ఆలయం వర్షాకాలంలో నీరు లీకు అవుతుందని, ఆలయానికి సరైన రక్షణ లేదని, ఆలయ భూములు ,ఆస్తి కాపాడుతానని పేర్కొన్నారు.కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ డివిజన్ మాజీ ప్రెసిడెంట్ గంట రాజు సాగర్ , ఆలయ సిబ్బంది సైదులు,విజయకుమార్ ,లక్ష్మణరావు,కాంగ్రెస్ మహిళా నాయకులు లక్ష్మి ,సులోచన చంద్రకళ ,కొమరమ్మ, భక్తులు పాల్గొన్నారు.