గీతా విద్యాలయం పాఠశాలలో ఘనంగా వసంత పంచమి వేడుకలు చిన్నారులకు అక్షరాభ్యాసం..
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల ఫిబ్రవరి 3 (ప్రజా మంటలు) :
పట్టణంలోని గీతా విద్యాలయం పాఠశాలలో సోమవారం వసంత పంచమి పురస్కరించుకొని శ్రీ గీతా విద్యాలయం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన అక్షరాభ్యాస కార్యక్రమానికి విద్యార్థులు తల్లిదండ్రులు అధిక సంఖ్యలో పాల్గొని చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
అనంతరం చిన్నారులు విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలోని సరస్వతి అమ్మవారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్క తల్లిదండ్రులు గీతా విద్యాలయం, సరస్వతి శిశు మందిరం లో విద్యార్థులను చదివించాలని, ఈ పాఠశాలలో దేశభక్తి క్రమశిక్షణ తో పాటు విద్యను నేర్పడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గీతా విద్యాలయం పాఠశాల నిర్వాహకులు ఉపాధ్యాయులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.