పిల్లల భద్రతే మాకు ముఖ్యం, రోడ్డు ప్రమాద నివారణలో అందరూ భాగస్వాములు కావాలి: జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్
పిల్లల భద్రతే మాకు ముఖ్యం,
రోడ్డు ప్రమాద నివారణలో అందరూ భాగస్వాములు కావాలి: జిల్లా ఎస్పి శ్రీ అశోక్ కుమార్
జగిత్యాల జనవరి 20 (ప్రజా మంటలు):
స్కూల్ వాహనాలకు ఎలాంటి చిన్న ప్రమాదం జరిగిన సంబంధిత డ్రైవరు, యాజమాన్యం పై కఠినంగా వ్యవహరిస్తాం.విద్యాసంస్థల ప్రతి వాహనానికి తప్పనిసరిగా రోడ్ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వారి చే జరిచేయబడిన ఫిట్‌నెస్ సర్టిఫికెట్ ఉండాలనీ ఎస్పీ అశోక్ కుమార్ సూచించారు.
రోడ్డు భద్రతా మాసోత్సవాల లో బాగంగా ఈరోజు జిల్లా వ్యాప్తంగా ఉన్న స్కూల్ వాహనాల ఫిట్‌నెస్,స్కూల్ బస్సులకు ఎలాంటి ప్రమాదాలకు జరుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డ్రైవర్లకు ట్రాఫిక్, రోడ్ సేఫ్టీ పై అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ఎస్పి అశోక్ కుమార్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... జిల్లా లో రోడ్డు ప్రమాదల నివారనే లక్ష్యంగా స్కూల్స్ బస్ డ్రైవర్స్ కి ట్రాఫిక్ మరియు రోడ్ సేఫ్టీ పై అవగాహన ఉండాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నరు. చాలా వరకు జరిగిన రోడ్డు ప్రమాదాలలో అతివేగంగా నడపడం వల్లనే ప్రమాదాలు జరుగుతున్నాయని అన్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ పలు స్కూల్ వాహనాల యొక్క ఫిట్నెస్ సర్టిఫికెట్లు, ప్రమాణాలు పాటిస్తున్నారు లేదా అని స్వయంగా పరిశీలించి పాటించని వాహనాలపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులను ఆదేశించారు.