మాదిగల మహా ప్రదర్శనకు బీసీలుగా మద్దతిద్దాం బీసీ నేత దరువు అంజన్న
జగిత్యాల జనవరి 20(ప్రజా మంటలు )
ఫిబ్రవరి ఏడవ తారీఖున హైదరాబాద్ మహానగరంలో మందకృష్ణ మాదిగ జరపతల పెట్టిన లక్ష డప్పులు వేల గొంతుల మహాప్రదర్శనకు బీసీలుగా తరలిరావాలని బీసీ కవులు కళాకారులు మేధావుల ఐక్యవేదిక కన్వీనర్ దరువు అంజన్న పిలుపునిచ్చారు. జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం లో
ఉద్యమకారులు,కవి మోహన్ బైరాగి మాట్లాడుతూ ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ ప్రజాస్వామికమైన డిమాండ్ అని దానిని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు
, ఈ మహా ప్రదర్శనకు ఎస్టీ,బీసీలు, ఓసీలు సైతం మద్దతు ఇవ్వడం హర్షించదగ్గ విషయం అన్నారు అలాగే ఈనెల 24న మంద కృష్ణమాదిగ జగిత్యాల వస్తున్న సందర్భంగా బీసీ మేధావులు కళాకారులు ప్రజాసంఘాల నాయకులు పాల్గొనాలని పిలుపునిచ్చారు
ఈ సమావేశంలో ఎంఎస్సి జిల్లా అధ్యక్షులు దుమల గంగారాం, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు సురుగు శ్రీనివాస్,జిల్లా అధికార ప్రతినిధి బెజ్జంకి సతీష్,బొనగిరి కిషన్,సీనియర్ నాయకులు బాలే శంకర్,రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ, బి.సి యువజన సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తిరుపురం రాంచందర్, బి.సి మహిళా సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి రాచకొండ రోజా (న్యాయవాది), బిసి సంక్షేమ సంఘం నియోజకవర్గ అధ్యక్షురాలు బండపెల్లి మల్లీశ్వరి, బిసి సంక్షేమ సంఘం పట్టణ అధ్యక్షుడు రాపర్తి రవి, యూత్ కో-ఆర్డినేటర్ హృషికేష్, ఎమ్మార్పీఎస్ ప్రచార కార్యదర్శి కొల్లూరి సురేందర్ నియోజకవర్గ ఇన్చార్జి నక్క సతీష్ కో ఇన్చార్జి పొండేటి సునీల్ పట్టణ అధ్యక్షులు బొల్లరపు దివాకర్ రూరల్ మండల అధ్యక్షులు దాసరి సతీష్ ,అర్బన్ మండల అధ్యక్షులు బాపురపు గంగారాం, గౌరవ అధ్యక్షులు,సంగేపు ముత్తు ,తదితరులు పాల్గొన్నారు.