పసుపు బోర్డు ఇందుర్లో ఏర్పాటుతో బిజెపి నాయకులు సంబరాలు
పసుపు బోర్డు ఇందుర్లో ఏర్పాటుతో బిజెపి నాయకులు సంబరాలు
- పాలాభిషేకం చేసిన మండల అధ్యక్షుడు బాయ్ లింగారెడ్డి.
ఇబ్రహీంపట్నం జనవరి 15 (ప్రజా మంటలు):
భారతీయ జనతా పార్టీ ఇబ్రహీంపట్నం మండల శాఖ ఆధ్వర్యంలో బీజేపీ నాయకుల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.
మండలం అధ్యక్షులు బాయి లింగారెడ్డి మాట్లాడుతూ బీజేపీ మాట ఇస్తే అది నెరవేస్తుందని, ఆది కాశ్మీర్ 370 ఆర్టికల్ విషయమైన, ఇటీవల మొదటి వార్షికోత్సవం అయిన అయోధ్య శ్రీ రామ జన్మభూమి మందిరం అయిన, ఇప్పుడు పసుపు బోర్డు అయిన ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నది ఒక భారతీయ జనతా పార్టీ అని అన్నారు.
పసుపు బోర్డు కల ఇందురు గడ్డ పైన ప్రకటించిన , భారత దేశ ప్రధాని మోదీకి, పసుపు బోర్డు ఏర్పాటులో కీలకమైన మన ఇందురు పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగింది.
పసుపు బోర్డు చైర్ పర్సన్ గా ఎన్నికైన ఎబివిపి నుండి భారతీయ జనతా పార్టీకి విధేయుడు, రైతు బిడ్డ ఆయన పల్లె గంగారెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేశారు.
కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శులు సుంచు రణధీర్, పంతగి వెంకటేష్ యాదవ్, జిల్లా నాయకులు శ్రీనివాస్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి మండల ఉపాధ్యక్షలు తిరుమల చారి, కార్యదర్శిలు సతీష్, స్వామి, దేవన్న మోర్చాల అధ్యక్షులు శ్రీనివాస్, నవీన్ రెడ్డి, సురేష్, రాజారెడ్డి బూత్ అధ్యక్షులు , శక్తి కేంద్రం ఇన్చార్జిలు, ముఖ్య బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.