సలాం ! పోలీస్... తప్పిపోయిన వారికి అండగా పోలీస్ కంట్రోల్ రూమ్
కొత్తకొండ బ్రహ్మోత్సవాలలో భక్తులకు అండగా పోలీస్ సేవలు
- సిఐ పులి రమేష్
భీమదేవరపల్లి జనవరి 15 (ప్రజామంటలు) :
కొత్తకొండ బ్రహ్మోత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కిక్కిరిసిన భక్తజనము మధ్యలో చాలామంది జన సమూహంతో అయోమయం అవుతున్నారు. ఈ సందర్భంగా సిఐ పులి రమేష్, ఎస్సై సాయిబాబు ఆధ్వర్యంలో కపోలీసులు 24 గంటలు అప్రమత్తంగా ఉంటూ కంట్రోల్ రూమ్ నుండి ఎప్పటికప్పుడు తప్పిపోయిన వారి సమాచారం క్షణాల్లో కుటుంబ సభ్యులకు తెలియపరుస్తున్నారు. బుధవారం మల్లారం గ్రామానికి చెందిన గంగారపు ఆరాధ్య (4 ) జాతర లో తప్పిపోగా, ఒక భక్తురాలు పాప ఒంటరిగా ఉండటం గమనించి పాపను పోలీస్ కంట్రోల్ రూం కు తీసుకురాగా, వెంటనే పాప తల్లిదండ్రుల వివరాలు మైక్ లో ప్రకటించగా పాప యొక్క తల్లి దండ్రులు రాగా, పాపను వారికి అప్పగించటం జరిగింది. పాప తల్లిదండ్రులు పోలీస్ వారికి కృతజ్ఞతలు తెలిపారు.
Regards: CI Elkaturthy