అనాథలు, నిరాశ్రయుల కోసం నిర్విరామంగా 268వ అన్నదాన కార్యక్రమం
అనాథలు, నిరాశ్రయుల కోసం నిర్విరామంగా 268వ అన్నదాన కార్యక్రమం
సికింద్రాబాద్ జనవరి 13:
ఆకలితో అలమటిస్తూ అనాథలు, నిరాశ్రయులు ఎందరో రాష్ట్ర రాజధాని మహానగరం భాగ్యనగరం రోడ్ల పక్కన ఫుట్ పాత్ల మీద జీవనం సాగిస్తున్నారు. ఆకలితో అలమటిస్తున్న నిరాశ్రయులు, అనాథలు, అభాగ్యులను గుర్తించి వారికీ ఆహారం అందించాము. క్రమం తప్పకుండా నిర్విరామంగా కొనసాగిస్తున్న అన్నదాన కార్యక్రమాలు 268 వ అన్నదాన కార్యక్రమానికి చేరుకుంది.
అనాథలను, నిరాశ్రయులను గుర్తించి వారికి ఆశ్రయం కలిపించి, ఆహారం, వైద్యం, బట్టలు అందించింది వారి జీవితం వాళ్ళు బ్రతికేలా ప్రభుత్వం ప్రత్యేక శాఖను ఏర్పాటు చేసి చిన్నతరహా కుటీరపరిశ్రమలు నెలకొల్పి స్వయం ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని స్కై ఫౌండేషన్ తరపున కోరుతున్నాము. ఈ అన్నదాన కార్యక్రమములో ప్రెసిడెంట్ వై.సంజీవ కుమార్, వైస్ ప్రెసిడెంట్ ఓ.పావని. సేవాసభ్యులు నేహా అన్సారీ, అఖిల్, హరీష్, ఇఫ్రాన్ మొదలగు వాళ్ళు పాల్గొన్నారు.