పాడి కౌశిక్... అసలు నీది ఎం పార్టీ?ఒక ఎమ్మెల్యే కు ఇచ్చే గౌరవం ఇదేనా?
పాడి కౌశిక్... అసలు నీది ఎం పార్టీ?ఒక ఎమ్మెల్యే కు ఇచ్చే గౌరవం ఇదేనా? కౌశిక్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలి
జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాలా జ్యోతి లక్ష్మణ్ డిమాండ్
జగిత్యాల జనవరి 12:
నాయకులకు కావాల్సింది ప్రజా సంక్షేమం అభివృద్ధి తప్ప పార్టీలతో సంబంధం ఏంటి?జగిత్యాల నియోజకవర్గం ప్రజలు ఆదరించి ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గెలిపించారుని, ఆయనపై దాడి చేయడం హేయమైన చర్య అని జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాలా జ్యోతి లక్ష్మణ్ అన్నారు.
ఇంకా, అయనపై విమర్శలు చేయడం, చెయ్యితో నెట్టి వెయ్యడం నీ నీచ రాజకీయనికి సంస్కరానికి నిదర్శనం.గతంలో తెలంగాణ ద్రోహి అయిన వైఎస్ జగన్ తో అంటకాగి, ఉద్యమ కారులపై రాళ్లు విసిరిన చరిత్ర నీది.కాంగ్రెస్ పార్టీ అదరిస్తే నమ్మకద్రోహం చేసి బీఆరెస్ లో చేరిన నీకూ నైతికత ఉందా?అని ప్రశ్నించారు.
స్వార్థ ప్రయోజనం కొరకు పార్టీ మారిన చరిత్ర నీది - ప్రజా సంక్షేమం జగిత్యాల ప్రాంత అభివృద్ధి కోసం పార్టీ మరిన ఘనత సంజయ్ అన్నది.
హుజురాబాద్ లో గెలవలేని స్థితిలో గెలవకుంటే కుటుంబం తో సహ ఆత్మహత్య చేసుకుంటానని ప్రజల్ని బ్లాక్ మెయిల్ చేసిన చరిత్ర నీది.
ఎమ్మెల్యే గా ఆయనకు మాట్లాడే హక్కు ఉంది. మైక్ ఎవరు ఇచ్చారాని అడిగే హక్కు నీకూ ఎక్కడిది?రాష్ట్రం లో ఇంకా బీఆరెస్ ప్రభుత్వం అధికారంలో ఉందనే భ్రమలో ఉన్నట్టు ఉన్నారు.
కళ్ళు తెరిచి చూడు కొడంగల్ కొదమ సింహం రేవంత్ అన్న సీఎం గా ఉన్న ప్రజా ప్రభుత్వం పాలన సాగుతుంది. ఒక ఎమ్మెల్యే పట్ల అనుచ్చితంగా ప్రవర్తించిన కౌశిక్ రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.