ఐఎంఏ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

On
ఐఎంఏ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

IMG-20241124-WA0417ఐఎంఏ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

గొల్లపల్లి నవంబర్ 24 (ప్రజా మంటలు):

ఐఎంఏ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో గొల్లపల్లి మండలం మల్లన్న పేట గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు వైద్య శిబిరంలో మధుమేహం,  బిపి , కంటి పరీక్షలు, దంత పరీక్షలు నిర్వహించారు  అవసరమున్న వారికి గుండె పరీక్షలకు ఈసీజీ ప్రతి ఒక్కరికి అవసరం మేరకు మందులను ఉచితంగా అందించారు.
 ఈ వైద్య శిబిరంలో దాదాపు 277 మంది గ్రామస్తులు వైద్య సేవలను అందుకున్నారు.
 ఈ శిబిరాన్ని ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ గూడూరి హేమంత్ ,  ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆకుతోట శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ మృదుల, డాక్టర్ ఈ రాజశేఖర్ , డాక్టర్ కే సుధీర్, డాక్టర్ ఆర్ ప్రశాంత్‌ వైద్య సేవలు అందించారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ భీమ సంతోష్, మాజీ సర్పంచ్ సిద్ధంకి మల్లారెడ్డి, మాజీ ఎంపీటీసీ గోసుకుల రాజన్న , మాజీ ఉపసర్పంచ్ బీరకిషోర్,  బీమా సత్తన్న , అవారి చందు, యువజన సంఘ సభ్యులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags