ఎం సి హెచ్ లో పుట్టిన నవజాత శిశువులు తారుమారు.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల నవంబర్ 4 (ప్రజా మంటలు):
ఎంసిహెచ్ లో అప్పుడే పుట్టిన నవజాత శిశువులు తారుమారయ్యాయి.దీంతో బంధువులు ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
బీర్పూర్ మండలం మంగేలా గ్రామానికి చెందిన ప్రసన్న పురిటి నొప్పులతో ఎంసిహెచ్ లో చేరింది.
సోమవారం ప్రసన్న తో పాటు మరో మహిళకు డాక్టర్లు డెలివరీ చేశారు.తర్వాత ఆస్పత్రి సిబ్బంది శిశువుల చేతికి ఉన్న ట్యాగ్స్ చూసుకోకుండా ఒకరి బేబీని మరొకరికి ఇచ్చారు.
వెంటనే జరిగిన పొరపాటున గుర్తించి ఎవరి పిల్లలను వారికి అప్పగించారు.
ఈ ఘటనపై ప్రసన్న భర్త సతీష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులకు ఫిర్యాదు చేద్దామంటే ఆస్పత్రిలో ఉన్న నెంబర్లు కు కాల్ చేస్తే స్పందించడం లేదంటూ మండిపడ్డారు.
బేబీ ఇచ్చే సమయంలో డ్రెస్ టవల్ మాది కాదు అని చెప్తున్నా మీ బేబీ ఏ అంటూ ఇచ్చారని ఆరోపించారు.ఈ ఘటనపై ఆర్ఎంఓ నవీన్ ను వివరణ కోరగా శిశువులు తారుమారు అయిన మాట వాస్తవమేనన్నారు.
పిల్లల చేతికి ఉన్న ట్యాగ్ చూసుకోకుండా సిబ్బంది బంధువులకు అప్పగించారని తెలిపారు.
ఈ ఘటనను సూపరింటెండెంట్ దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటామని సోమవారం మధ్యాహ్నం 1 గంటకు మీడియాకు తెలియజేశారు.