రాష్ట్రమంత్రివర్గ కూర్పుల్లో బీసీలకిచ్చిన చోటేది: ఎం.పి.వద్దిరాజు రవిచంద్ర

On
రాష్ట్రమంత్రివర్గ కూర్పుల్లో బీసీలకిచ్చిన చోటేది: ఎం.పి.వద్దిరాజు రవిచంద్ర

రాష్ట్రమంత్రివర్గ కూర్పుల్లో బీసీలకిచ్చిన చోటేది: ఎం.పి.వద్దిరాజు రవిచంద్ర
హైదరాబాద్ సెప్టెంబర్ 11:
ఇంట్లోని బిడ్డలకు ఎంత ఆహారం అవసరమో లెక్కకట్టి తల్లి వంట చేస్తుంది. కుటుంబ నిర్వహణకు ఖర్చుల లెక్కలు తల్లిదండ్రులిద్దరు చూస్తారని, అదేవిధంగా ప్రజలందరి సంక్షేమం చూసే ప్రభుత్వం తల్లిదండ్రుల లెక్కన సమాజంలో సగభాగమైన బీసీల లెక్కలెందుకు చూడరని రాజ్యసభ సభ్యులు, బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ప్రశ్నించారు. రిటైర్డ్ ప్రొఫెసర్ జి.లక్ష్మణ్ రాసిన ‘‘కులగణన, రిజర్వేషన్లు - శాస్త్రీయ అవగాహన’’ అన్న పుస్తకాన్ని బుధవారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో జస్టిస్ ఈశ్వరయ్య ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ బీసీలు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాలలో అనుభవిస్తున్న బాధలు, నైరాశ్యం, కష్టాలను ప్రొఫెసర్ లక్ష్మణ్ తన పుస్తకంలో చక్కగా విశ్లేషించారన్నారు. పద్మవ్యూహంలో చిక్కుకున్న బీసీలు అందులోంచి బయటపడేందుకు మార్గాలు అన్వేషించుకోవాల్సిన అవసరముందన్నారు. ఈ పుస్తకాన్ని బీసీల రాజ్యాంగంగా భావించి ప్రజల్లోకి విస్తృతంగా తీసుకుపోవాల్సిన అవసరముందన్నారు. బీసీలకు దక్కాల్సిన న్యాయమైన హక్కులు, వాటాలపై అవగాహన కల్పిస్తూ సభలు, సమావేశాలు విస్తృతంగా జరుపుకోవాలని సూచించారు. బీసీల సమస్యల సాధనకు బీసీ బిడ్డగా పార్లమెంటులో కొట్లాడుతానని చెప్పారు. మహిళాబిల్లు ఆమోదంలో బీఆర్ఎస్ కీలకభూమిక పోషించిందన్నారు. 
తెలంగాణ ప్రభుత్వ మంత్రివర్గ కూర్పులో ఇద్దరే బీసీ మంత్రులున్నారని, మున్నూరు కాపు, ముదిరాజ్, యాదవ, మైనార్టీలు తదితర బీసీ వర్గాలకు ప్రాతినిధ్యం ఎందుకు లేదని వద్దిరాజు రవిచంద్ర ప్రశ్నించారు. మేమెంతో మాకంత అన్న మార్గంలో బీసీ జనాభాకనుగుణంగా మంత్రివర్గ కూర్పులో స్థానాలుండాలన్నారు. బీసీలు 60 శాతం దాకా ఉంటే 42 శాతం ఎట్లా ఇస్తారని మా వాటా మాకే ఇవ్వాలని వద్దిరాజు డిమాండ్ చేశారు.

బీసీలు ప్రశ్నించనంతకాలం ఇంతే: కే.కేశవరావు
తమ వాటా తమకివ్వాలని ఎంతకాలమైతే బీసీలు అడగరో అప్పటి వరకు బీసీలు ఇదే స్థితిలో కొనసాగుతారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు అన్నారు. బీసీలది కులఉద్యమం కాదని, ఇది ప్రజాస్వామ్య ఉద్యమమని పుస్తకం రచయిత లక్ష్మన్ రాశారని చెప్పారు. కులవృత్తుల ఉత్పత్తి శక్తులను కూలీలుగా మార్చారని అందుకే సమాజంలో అంతరాలు వచ్చాయన్నారు. 130 బీసీ కులాల వారున్నప్పుడు అందులో అన్ని బీసీ కులాలకెలా మంత్రిపదవులు పంపిణీ చేస్తారని విశ్లేషించారు. బీసీల రాజ్యం వచ్చేవరకు అధికారపంపిణీ  వీళ్ళ చేతుల్లో ఉండదన్నారు. మంత్రివర్గంలో ఇద్దరు బీసీలకే మంత్రిపదవులిచ్చారని వద్దిరాజు అడుగుతున్నారని ఇదే ఆవేదన ప్రతి బీసీ ఎదలో ఉందన్నారు. పిసిసి జనరల్ సెక్రటరీగా వున్నప్పుడు మావాటా మాకు 50 శాతం కావాలని అడిగినట్లు గుర్తు చేశారు. ఆగ్రహించి రాజీనామా చేసి బైటకు వచ్చానన్నారు. తన అరవై ఏళ్ళ రాజకీయ పార్టీ అనుభవంలో తిరగబడితే పని జరిగింది కానీ కోరుకుంటూ పోతే పని జరుగలేదన్నారు. ప్రభుత్వం కులగణన చేస్తే ఆ తర్వాత మా వాటా మేం తీసుకుంటామని ప్రతి బీసీ మదిలో ఉందని కేశవరావు అభిప్రాయపడ్డారు. 

బీసీ సమస్యల జెండానెత్తితే బీఆర్ఎస్ కు పూర్వ వైభవం: జస్టిస్ ఈశ్వరయ్య
కులగణన ఉద్యమాన్ని బీఆర్ఎస్ తన భుజస్కంధాలపై వేసుకుంటే బీఆర్ఎస్ కు తిరిగి పూర్వవైభవం వస్తుందని రిటైర్డ్ జస్టిస్ ఈశ్వరయ్య అన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి రావాలంటే బీసీల సమస్యల జెండా ఎత్తాలని తెలిపారు. అంతకు ముందు రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర, తెలంగాణ రాష్ట్ర సలహాదారుడు కే.కేశవరావు మాట్లాడిన దానికి ఆయన సుదీర్ఘంగా వివరణ ఇచ్చారు. బీసీలకు అన్ని రంగాల్లో సమ భాగస్వామ్యం ఉండాలన్నారు. బీసీలకు రిజర్వేషన్లు అన్నది ఎవరో ఇచ్చే భిక్ష కాదని, అన్ని కులాలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు కులగణన జరగాలని తెలిపారు. తెలంగాణలోని ఆనాటి 14 సంస్థానాల్లో ఆధిపత్యం ఆధిపత్య కులాలదేనని బ్రిటిష్ కాలం నుంచి నేటి పాలకుల వరకు పంచాయతీ నుంచి పార్లమెంటు దాకా అగ్రకులాలే ఆధిపత్యం చెలాయిస్తున్నాయని వివరించారు. దేశంలో పెద్ద పెట్టుబడి దారుడైన ముఖేష్ అంబానీకి ఎంత ప్రాధాన్యతనిస్తున్నారో పేదవానికి కూడా అదే స్థాయిలో సమాన గౌరవం లభించాలని భారత రాజ్యాంగం చెబుతుందని తెలిపారు. బీసీలు చైతన్యంతో హక్కులను సాధించుకుంటే అగ్రకులాల వాళ్ళు రిజర్వేషన్లు అడిగేదశకు వస్తారని ఆ దిశగా బీసీ ఉద్యమాలు పదునెక్కాలని చెప్పారు. 130 బీసీ కులాలకు వర్గీకరణ జరిపి ప్రతి చిన్న కులానికి కూడా న్యాయం జరిగేలా చేయాలని తెలిపారు. అభివృద్ధి చెందుతున్న బీసీ కులాలు ఎంబీసీలు, కింది కులాలను అక్కున చేర్చుకోవాలన్నారు. బీహారులో మాదిరిగా తెలంగాణలో కూడా 60 శాతం బీసీ కులాలకు సంబంధించిన సమగ్ర కుటుంబసర్వేలు జరపాలని ప్రభుత్వానికి తెలిపారు. బీసీ కులాలు, ఇతర కులాలందరికీ సంబంధించిన జీవన విధానం తెలుసుకునేందుకు 100 అంశాలు పెట్టుకుని బీసీ కులగణన సర్వే చేయాలని సూచించారు. అన్ని రంగాల్లో మాదిరిగానే న్యాయస్థానాలలో కూడా బీసీలకు న్యాయం జరగటం లేదన్నారు. బీహార్ లో 40 శాతం నుంచి 65 శాతానికి రిజర్వేషన్లు పెంచితే పాట్నా హైకోర్టు కొట్టివేసిందని, దీనిపై తాను సుప్రీంకోర్టుకు అప్పీలుకు పోయానని జస్టిస్ ఈశ్వరయ్య తెలియజేశారు. 
తెలంగాణ రాష్ట్ర తొలి బీసీ కమిషన్ సభ్యులు జూలూరు గౌరీశంకర్ మాట్లాడుతూ బీసీ ఉద్యమానికి బీసీ ఉపాధ్యాయులు, ప్రొఫెసర్లు, విద్యావంతులు పాలు పంచుకుని కులగణన ఉద్యమానికి మార్గదర్శకులు కావాలని కోరారు. పుస్తకరచయిత జి.లక్ష్మణ్ మాట్లాడుతూ పుస్తకంలోని అంశాలను విశ్లేషించి చెప్పారు. ఈ కార్యక్రమానికి సామాజిక ఉద్యమకారుడు రౌతు కనకయ్య అధ్యక్షత వహించగా విద్యుత్ బీసీ ఉద్యమ సంఘం నేత దేవుళ్ళ సమ్మయ్య, ఆకుల రజిత్, సీనియర్ జర్నలిస్టు దుర్గం రవీందర్, వనమాల చంద్రశేఖర్, ఉస్మానియా అధ్యాపకుల సంఘం అధ్యక్షుడు డి. మనోహర్ లు మాట్లాడారు,మున్నూరుకాపు సంఘం ప్రముఖులు సర్థార్ పుటం పురుషోత్తమ రావు,ఆవుల రామారావు తదితరులు పాల్గొన్నారు.

Tags

More News...

National  International  

దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ అరెస్ట్

దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ అరెస్ట్   దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ అరెస్ట్   సియోల్ జనవరి 15: దక్షిణ కొరియా అధికారులు బుధవారం ఉదయం అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌ను అదుపులోకి తీసుకున్నారు, ఆయన అధికారిక నివాసంపై తెల్లవారుజామున జరిగిన నాటకీయ పోలీసు దాడి తర్వాత "రక్తపాతాన్ని నివారించడానికి" ఆయన లొంగిపోయారు. మార్షల్ లా విధించడానికి మరియు రాజకీయ నియంత్రణను...
Read More...
National  International  

BCCI కార్యదర్శిగా దేవజిత్ సైకియా

BCCI కార్యదర్శిగా దేవజిత్ సైకియా BCCI కార్యదర్శిగా దేవజిత్ సైకియా ముంబై జనవరి 15: BCCI కార్యదర్శిగా దేవజిత్ సైకియా ఎన్నికయ్యారు, ప్రభతేజ్ సింగ్ భాటియా కోశాధికారిగా ఉన్నారుజయ్ షా మరియు ఆశిష్ షెలార్ ఖాళీ చేసిన పదవులకు నామినేషన్ దాఖలు చేసిన ఏకైక వ్యక్తి వీరిద్దరూ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) కార్యదర్శిగా దేవజిత్...
Read More...
National  State News 

కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయం "ఇందిరా భవన్" ప్రారంభం నేడే 

కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయం కాంగ్రెస్ పార్టీ కొత్త కార్యాలయం "ఇందిరా భవన్" ప్రారంభం నేడే  24 అక్బర్ రోడ్ కార్యాలయం - ఇక ఒక చరిత్ర ఢిల్లీ జనవరి 15:‘24, అక్బర్ రోడ్’ 47 సంవత్సరాల చరిత్రతో ముగిసింది. నేడు కాంగ్రెస్ కొత్త ప్రధాన కార్యాలయానికి తరలింపు.   కాంగ్రెస్ పార్టీ తన కొత్త ప్రధాన కార్యాలయం - నలభై...
Read More...
National  State News 

ఈ నాటి ప్రధాన వార్తలు

ఈ నాటి ప్రధాన వార్తలు ఈనాటి ప్రధాన వార్తలు - నేడే కాంగ్రెస్ కొత్త కార్యాలభవనం ప్రారంభం   హైదరాబాద్ జనవరి 15: ఢిల్లీలో సీఎం రేవంత్..కేంద్రమంత్రులను కలిసే అవకాశం    నార్సింగి డబుల్ మర్డర్ కేసులో మృతుల గుర్తింపు. యూపీలో తెలంగాణ బస్సు దగ్ధం, ఒకరు సజీవదహనం. ప్రయాణికులు భైంసా కు చెందినవారుగా గుర్తింపు     తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్‌ సుజయ్...
Read More...
Local News  State News 

మకర సంక్రాంతికి మోడీ జీ మరచిపోలేని బహుమతి, ఇచ్చిన మాట నిలపెట్టుకున్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్.

మకర సంక్రాంతికి మోడీ జీ మరచిపోలేని బహుమతి, ఇచ్చిన మాట నిలపెట్టుకున్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల జనవరి 14 (ప్రజా మంటలు) : ఈ రోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో స్థానిక తహసిల్ చౌరస్తాలో నిజమాబాద్ కేంద్రంగా పసుపు బోర్డ్ ఏర్పాటు చేసిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది,...
Read More...
Local News 

ఘనంగా కురుమ సంఘం చే బీరప్పకు బోనం సమర్పణ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ.

ఘనంగా కురుమ సంఘం చే బీరప్పకు బోనం సమర్పణ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల జనవరి 14 (ప్రజా మంటలు) :  మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా మంగళవారం బీరప్ప ఆలయం వద్ద పట్టణ కురుమ సంఘం ఆధ్వర్యంలో బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రచార కార్యదర్శి చెట్టి నరసయ్య మాట్లాడుతూ.... తమ కులదైవం బీరప్ప స్వామి అని తొలి...
Read More...
Local News 

రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా వాహనదారులకు రోడ్డు నిబంధనలపై అవగాహన.

రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా వాహనదారులకు రోడ్డు నిబంధనలపై అవగాహన. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల జనవరి 14 (ప్రజా మంటలు) : రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలో వాహనదారులకు రోడ్డు భద్రత గూర్చి అవగాహన కల్పించారు. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని అదేవిధంగా సీట్ బెల్ట్ ధరించాలని, డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని వివరించారు. ఈ కార్యక్రమంలో...
Read More...
Local News  State News 

శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఘనంగా గోదా రంగనాథ కళ్యాణ వేడుకలు.

శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఘనంగా గోదా రంగనాథ కళ్యాణ వేడుకలు. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  జగిత్యాల జనవరి 14 (ప్రజా మంటలు) :  జిల్లా కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి 8 గంటలకు గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై వేంచేపు చేసి కళ్యాణాన్ని కొనసాగించారు....
Read More...
Local News 

మూగబోయిన ఉద్యమ గొంతుక చెప్యాల ప్రభాకర్

మూగబోయిన ఉద్యమ గొంతుక చెప్యాల ప్రభాకర్ భీమదేవరపల్లి జనవరి 15 (ప్రజామంటలు) : తెలంగాణ ఉద్యమకారుడు, మంచి వక్త చెప్యాల ప్రభాకర్ హఠాన్మరణం భీమదేవరపల్లి మండలంలో విషాదాన్ని నింపింది. తెలంగాణ యాస, మండలంలోని గ్రామాల్లో తన మాటలతో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన మాటల మాంత్రికుడు ఇకలేరన్న వార్త.. తెలంగాణ ఉద్యమకారులను తీవ్రంగా కలిచి వేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో ఆయనకు విడదీయరాని అనుబంధం...
Read More...
Local News 

మల్లన్న పేటలో మకర సంక్రాంతి ముగ్గుల పోటీ  నిర్వహించిన ఆవారి చందు

మల్లన్న పేటలో మకర సంక్రాంతి ముగ్గుల పోటీ  నిర్వహించిన ఆవారి చందు మల్లన్న పేటలో మకర సంక్రాంతి ముగ్గుల పోటీ నిర్వహించిన ఆవారి చందు గొల్లపల్లి జనవరి 13 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం మల్లన్నపెట లో సంక్రాంతి పండుగా సందర్భంగా యువ నాయకుడు ఆవారి చందు ఆధ్వర్యంలో  ఆడపడుచులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్వయం కృషితో ఎదిగి,మహిళా లోకానికి ఆదర్శం అయినటువంటి...
Read More...
Local News  State News 

ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు

ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు కరీంనగర్ జనవరి 14:  ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో పాటు మరో ఇద్దరు పెట్టిన కేసులో కరీంనగర్ కోర్టు బెయిల్మం జూరు చేసింది.మూడు కేసుల్లో బెయిల్‌ మంజూరు చేసిన జడ్జిరూ.25 వేల చొప్పున రెండు పూచీకత్తులు ఇవ్వాలని ఆదేశంసమీక్షా...
Read More...

ప్రపంచవ్యాప్త బౌద్ధ సన్యాసులచే ఒడిశా లో సన్యాసి గురు పద్మసంభవ జప కార్యక్రమం

ప్రపంచవ్యాప్త బౌద్ధ సన్యాసులచే ఒడిశా లో సన్యాసి గురు పద్మసంభవ జప కార్యక్రమం ప్రపంచవ్యాప్త బౌద్ధ సన్యాసులచే ఒడిశా లో సన్యాసి గురు పద్మసంభవ జప కార్యక్రమం బుభనేశ్వర్ జనవరి 14: ప్రపంచవ్యాప్తంగా 1200 మందికి పైగా బౌద్ధ సన్యాసులు ఒడిశాలో జరిగే మొదటి గురు పద్మసంభవ జప కార్యక్రమంలో పాల్గొనడానికి సమావేశమవుతున్నారు. జనవరి 13 ఆదివారం ప్రారంభమై జనవరి 16 వరకు కొనసాగే మొదటి గురు పద్మసంభవ జప...
Read More...