జిల్లా కేంద్రం విద్యానగర్ లోని శ్రీ సీతారామ మందిరంతో పాటు ఆంజనేయ స్వామి దేవాలయంను స్వాధీనం చేసుకున్న దేవాదాయ శాఖ అధికారులు.

On
జిల్లా కేంద్రం విద్యానగర్ లోని శ్రీ సీతారామ మందిరంతో పాటు ఆంజనేయ స్వామి దేవాలయంను స్వాధీనం చేసుకున్న దేవాదాయ శాఖ అధికారులు.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల ఆగష్టు 28 (ప్రజా మంటలు) : 

జిల్లా కేంద్రంలోని విద్యానగర్ లో ఉన్న 476 సర్వేనెంబర్ పరిధిలోని మూడెకరాల 21 గుంటల స్థలంలో నిర్మాణం గావించిన శ్రీ సీతారామ మందిరంతోపాటు ఆంజనేయస్వామి దేవాలయం ఇతరత్రా ఉన్న కట్టడాలను బుధవారం ప్రాంతంలో దేవాదాయ శాఖ పరిధిలోకి స్వాధీనం చేసుకున్నట్లు కరీంనగర్ దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శ్రీమతి నాయిని సుప్రియ తెలిపారు.

గత 15 సంవత్సరాల క్రితం జగిత్యాల శ్రీ రామ మందిరం పరిధిలోని 476 సర్వే నెంబర్ లో ఇక్కడి ప్రాంత ప్రజలు, భక్తులు, ఎన్నారైల సహకారంతో నిర్మాణం గావించిన ఆలయాలను దేవాదాయ శాఖ స్థలంలో ఉన్నందున వాటిని స్వాధీనం చేసుకోవడం జరుగుతుందని గత వారం రోజుల క్రితం ఈ ప్రాంత నిర్వాహకులకు తెలియజేయడం జరిగిందని వివరించారు.

దీంతో అందరి సమ్మతితో 476 సర్వేనెంబర్ లోని ఆలయాలను, ఇతర కట్టడాలను స్వాధీనం చేసుకోవడం జరిగిందని శ్రీమతి సుప్రియ వెల్లడించారు.

ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ కరీంనగర్ అసిస్టెంట్ కమిషనర్ సుప్రియతో పాటు కార్య నిర్వహణ అధికారి కాంతి రెడ్డి మరియు దేవాదాయ శాఖ అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.

Tags