గడువు ముగిసిన వస్తువులు అమ్ముతున్న వ్యాపారిపై చర్యల కై డిమాండ్
గడువు ముగిసిన వస్తువులు అమ్ముతున్న వ్యాపారిపై చర్యల కై డిమాండ్
రాయికల్ ఆగస్ట్ 23 (ప్రజా మంటలు) : గడువు (ఎక్స్పైర్ )అయిన సామాగ్రిని అమ్ముతున్న వ్యక్తి పై చట్టరీత్య చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు అధికారులను కోరుతున్నారు. జగిత్యాల జిల్లా రాయికల్ మండల కేంద్రంలో రునిజ్ జనరల్ కిరాణం స్టోర్ లో ఎక్స్పైర్ అయిన సామాగ్రిని ప్రజలకు అమ్ముతున్నాడని ప్రజలు ఆరోపిస్తున్నారు. గోధుమ పిండిలో లక్కపురుగులు లాంటివి, గడువు తేదీ ముగిసిన చాక్లెట్లు బిస్కెట్స్ అమ్ముతున్నారని, పలు మార్లు కిరాణం యజమానికి చెప్పిన పట్టించుకోకపోవడంతో కొంత మంది షాప్ మాజమానిని నిలదీయడం జరిగింది. అయిన కూడా పట్టించుకోకపోవడంతో పాటు నువ్వు ఎవరికి చెప్పుతావో చెప్పుకో అని అనడంతో చివరికి మీడియాను ఆశ్రయించారు. ఇప్పటికైనా అధికారులు ప్రజల ఆరోగ్యానికి హాని చేసే తేదీగడువు తీరిన వస్తువుల అమ్మకాలను నిలుపుదల చేసి సదరు వ్యాపారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
-----