హాలో లైబ్రరీ గర్ల్. - ఆకర్షణను అప్యాయంగా పలకరించిన ప్రధాని
హాలో లైబ్రరీ గర్ల్...
- ఆకర్షణను అప్యాయంగా పలకరించిన ప్రధాని
అనందంతో ఉబ్బితబ్బిబైన ఆకర్షణ
సికింద్రాబాద్, ఆగస్ట్ 19 (ప్రజామంటలు) :
హైదరాబాద్ కు చెందిన 8వ క్లాస్ చదువుతున్న 12ఏండ్ల ఆకర్షణ ను ప్రధాన మంత్రి నరేంద్రమోదీ అభినందించారు. ఈనెల 15న న్యూఢిల్లీ లోని రాష్ర్టపతి భవన్ లో జరిగిన ఎట్ హోమ్ కార్యక్రమానికి హాజరైన అథిధుల సమూహంలో ఉన్న ఆకర్షణను గుర్తుపట్టిన ప్రధాని మోదీ హలో లైబ్రరీ గర్ల్.....అంటూ పలకరించడంతో తామంతా ఆశ్చర్యపోయామని ఆకర్షణ తండ్రి సతీష్ తెలిపారు. ఆకర్షణ తన సొంత ఖర్చులతో బుక్స్ కొని వరసగా అనాధాశ్రయాలు, పాఠశాలల్లో లైబ్రరీలను ఏర్పాటు చేస్తుంది. ఇంతవరకు 15 లైబ్రరీలను ఏర్పాటు చేసిన ఆకర్షణ ను కొంతకాలం క్రితం ప్రధానమంత్రి మోదీ ఆకర్షణను పిలిపించి, అభినందించారు. తన 25వ లైబ్రరీ ప్రారంభోత్సవానికి తాను వస్తానని ప్రధాని హామీ కూడ ఇచ్చారని ఆమె తెలిపారు. కాని రాష్ర్టపతి భవన్ లో జరిగిన ఎట్ హోమ్ కార్యక్రమంలో తనను గుర్తుంచుకొని లైబ్రరీ గర్ల్ అంటూ పలకరించడం ఆనందంగా ఉందని ఆకర్షణ పేర్కొంది.
రాష్ర్టపతి భవన్ ఆహ్వానం మేరకు ఇండిపెండెన్స్ డే వేడుకలకు ఆకర్షణ ఆమె పేరేంట్స్ తో కలసి న్యూఢిల్లీ వెళ్లి, వచ్చారు.
––––––––––
–ఫొటో: