జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్
జగిత్యాల జిల్లా :
జిల్లా కేంద్రంలో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా ఆసుపత్రిలో ఓ.పి. సేవలు, ల్యాబ్ రికార్డ్స్, మెడికల్ ఫార్మాసిని పరిశీలించి ఆసుపత్రిలో స్టాక్ పొజిషన్, సీజనల్ వ్యాధులైన డెంగ్యూ, మలేరియా మరియు ప్రసూతి సేవల పేషేంట్లకు ఇబ్బంది కలుగకుండా వైద్య సేవలు కల్పించాలని సూచించారు. డెంగ్యూతో ఎక్కువగా ఎవరు రాలేదని, సాధారణ జ్వరాలతో అడ్మిట్ అవ్వడం జరిగిందని, వారితో శుభ్రమైన త్రాగునీరు, భోజనం అందిస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా పేషేంట్ల వివరాలను, వారి ఆరోగ్య పరిస్థితిని గురించి కలెక్టర్ వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అందుబాటులో అందరూ వైద్యులు, సిబ్బంది ఉన్నారా లేదా అని అటెండెన్స్ రిజిస్టర్ పరిశీలించారు. అందుబాటులో లేని వారిపై చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.
ల్యాబ్ ని పరిశీలించి రక్త పరీక్షలు సరిగ్గా నిర్వహిస్తున్నారా లేదా అని ల్యాబ్ రికార్డ్స్ ని కలెక్టర్ చెక్ చేశారు.
కలెక్టర్ వెంట జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి యం.డి. సమీయొద్దీన్, ఆర్.ఎం.ఓ, వైద్యులు, సిబ్బంది, తదితరులు ఉన్నారు.