పశ్చిమబెంగాల్ రేప్ కేసు నిందితులని బహిరంగంగా ఉరితీయాలి -
బిజెపి జిల్లా కార్యదర్శి మాచర్ల కుమారస్వామి గౌడ్
భీమదేవరపల్లి ఆగస్టు 19 (ప్రజామంటలు) :
కలకత్తాలో జరిగిన రేప్ కేసులో నిందితులైన వారిని ఆ ఆడబిడ్డ పడ్డ బాధ కంటే వెయ్యి రేట్లు ఎక్కువగా బాధపడే విధంగా ఆ నిందితులని బహిరంగంగా ఉరితీయాలనీ హనుమకొండ జిల్లా బిజెపి కార్యదర్శి మాచర్ల కుమారస్వామి గౌడ్ అన్నారు. ఎందుకంటే ఈ సమాజంలో ఆడపిల్లలు బయటికి వెళ్లాలంటే ఇంకా భయంతో బతకడం నిజంగా మనకి సిగ్గుచేటు. పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ గారు, ఆ రాష్ట్ర హోం మంత్రిగా , రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా , రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి కూడా ఇప్పటివరకు నిందితులపై ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పలు అనుమానాలకి తావు ఇస్తుంది . కాబట్టి బాధ్యతయుతమైన పదవిలో ఉన్న మమత బెనర్జీ గారు నిందితులని వెంటనే అరెస్టు చేసి వారిపైన వెంటనే చర్యలు తీసుకోవాలి.
INDI అలయన్స్ లో ఉన్న పలు పార్టీలు దీనిపైన స్పందించకపోవడం నిజంగా హాస్యాస్పదం ప్రతి చిన్న విషయానికి కేంద్ర ప్రభుత్వంపై గొంతు చించుకునే కాంగ్రెస్ పార్టీ తమ భాగస్వామ్య పక్షమైన TMC అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్లో ఒక జూనియర్ డాక్టర్ పై ఇంత ఘోరం జరిగితే కనీసం స్పందించడంలేదంటే వారికి దేశ ప్రయోజనాల కంటే కేవలం అధికారం మీద మాత్రమే ఎక్కువ మక్కువ ఉన్నట్టుంది . ఈ ఘటనపై సిబిఐ దర్యాప్తు జరుపుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ నిందితులను వెంటనే కనుక్కొని వారికి తగిన శిక్ష పడే విధంగా చేయాలని కోరుకుంటున్నాను.