మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.
మెట్టుపల్లి ఏప్రిల్ 18 (ప్రజా మంటలు దగ్గుల అశోక):
జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణంలో బిస్మిల్లా మస్జిద్ నుండి ముస్లిం సమాజ ఆధ్వర్యంలో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింలు భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన వక్ఫ్ ప్రొటెక్షన్ బిల్ – 2025కు వ్యతిరేకంగా తమ ఆందోళనను వ్యక్తం చేస్తూ పెద్ద సంఖ్యలో ముస్లిం మత పెద్దలు, యువత ఈ ర్యాలీలో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ...ఈ బిల్లులో ఉన్న కొన్ని నిబంధనలు ముస్లిం సమాజ హక్కులను తీవ్రంగా హరించేవిగా ఉన్నాయని,వాక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు ఉన్న ప్రస్తుత విధానాలను మార్చి, ముస్లిమేతరులను వాక్ఫ్ బోర్డుల్లో చేర్చే ప్రతిపాదన మాతోపాటు మొత్తం ముస్లిం సమాజ అభిమతానికి వ్యతిరేకంగా ఉంది అని అన్నారు.
మతపరమైన ఆస్తులపై ముస్లిం సమాజకు మాత్రమే పరిపాలనాధికారం ఉండాలని వారు డిమాండ్ చేశారు. ముస్లింల సెంటిమెంట్స్‌ను గౌరవించకుండా తీసుకున్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయం మతసామరస్యాన్ని దెబ్బతీసేలా ఉందని వారు హెచ్చరించారు.ఆయా సంఘాల ప్రతినిధులు కేంద్ర ప్రభుత్వాన్ని వేడుకుంటూ, "మా అభిప్రాయాలను గౌరవించి వాక్ఫ్ ప్రొటెక్షన్ బిల్ 2025ను వెంటనే వెనక్కు తీసుకోవాలి" అని స్పష్టం చేశారు. ఈ సందర్బంగా ఆర్డీఓ కు వినతి పత్రం అందజేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవం.
.jpg)
గాలి కుంటూ వ్యాధి నివారణ టీకాలు

భూ భారతి అవగాహన సదస్సుకు రైతులందరు పాల్గొనాలి - తాసిల్దార్ వరందన్

భవిష్యత్తులో బంగారం ఇంకా పెరిగే అవకాశం ఉంది

యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్ అవేర్నెస్

అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"
