యాచక రహిత సమాజాన్ని నిర్మిద్దాం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
యాచక రహిత సమాజం, మానవత్వ విలువలపై పాఠాల్ని లఘు చిత్రాన్ని విడుదల చేసిన కేంద్రమంత్రి
- స్ఫూర్తి, విజేత విద్యా సంస్థలను అభినందించిన కిషన్ రెడ్డి
సికింద్రాబాద్ ఏప్రిల్ 15 (ప్రజామంటలు):
మానవత్వ విలువలను సనాతన ధర్మాన్ని తెలియజేస్తూ యాచక రహిత సమాజ నిర్మాణంకు కృషి చేద్దామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ లోని కేంద్ర బీజేపీ కార్యాలయంలో స్ఫూర్తి, విజేత విద్య సంస్థలకు సంబందించిన విద్య వేత్తలు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిసి యాచక రహిత సమాజం, మానవత్వ విలువలు, ధర్మ యుగం అనే అంశాలపై వారు చేస్తున్నా కృషిని వివరించారు.
ఈ సందర్బంగా ఆయా అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రముఖ సంగీత దర్శకుడు వందేమాతరం శ్రీనివాస్ పాడిన పాఠాల్ని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి విడుదల చేసారు ఈ సందర్బంగా వారిని కిషన్ రెడ్డి అభినందించారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ.. అనేక చోట్ల తల్లిదండ్రులు వదిలేసిన పిల్లలు, పిల్లలకు దూరమైన తల్లిదండ్రులు తిండిలేక రోడ్లపైన అడుక్కుంటున్నారని చెప్పారు.
ఇందులో అనేక మంది శారీరక, మానసిక వికలాంగులు కూడా ఉంటున్నారని.. వారికీ సరైన వసతులు కల్పించి అవసరమైన వారిని అనాథ ఆశ్రమాలలో చేర్పిస్తున్నట్లు చెప్పారు. విద్యార్థి దశలో ఉన్న వారైతే గురుకుల పాఠశాలలో, చిన్న పిల్లలైతే అనాథ శరణాలయాలలో చేర్పిస్తున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛంద సేవా సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు, స్థానిక ప్రజలు, వైద్య విద్యా సంస్థలు సహాయ సహకారాలతో చేస్తున్నామని పేర్కోన్నారు.
ఈ కార్యక్రమం ఇలాగే ముందుకు తీసుకెళ్లాలని.. అప్పుడు పోలీస్ వ్యవస్థ, నగరపాలక సంస్థలు, ప్రజా సేవకులు కూడా సహకరించే అవకాశం ఉంటుందన్నారు. ఈ అంశాలతో కూడిన పాటను వందేమాతరం శ్రీనివాస్ కిషన్ రెడ్డికి వినిపించారు. ఈ అంశాలపై ఒక లఘు చిత్రాన్ని కూడా నిర్మించినట్లు చెప్పారు. ఈ సమావేశంలో స్ఫూర్తి, విజేత విద్యా సంస్థల అధినేత రామకృష్ణం రాజు, ముదిగొండ విశ్వేశ్వర శాస్ట్రీ, సుధీర్ వర్మ, నంద, కిషోర్ తదితరులు పాల్గొన్నారు.
–ఫొటో:
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా శ్రీ వెంకటేశ్వర స్వామి తెప్పోత్సవం.
.jpg)
గాలి కుంటూ వ్యాధి నివారణ టీకాలు

భూ భారతి అవగాహన సదస్సుకు రైతులందరు పాల్గొనాలి - తాసిల్దార్ వరందన్

భవిష్యత్తులో బంగారం ఇంకా పెరిగే అవకాశం ఉంది

యముడు, చిత్రగుప్తుడు వేషధారణలో ట్రాఫిక్ అవేర్నెస్

అద్దంకి వ్యాఖ్యలు అహంకారపూరితం.. కాంగ్రెస్ కాదు స్కాంగ్రెస్ పార్టీ.. బిజెపి నాయకురాలు రాజేశ్వరి.

"కొప్పుల ఈశ్వర్- 50 ఏళ్ల ప్రయాణం - ఒక ప్రస్థానం" పుస్తకావిష్కరణ

అకాల వర్షాలకు కొట్టుకపోయిన గుడిసెలు. రోడ్డు పొడవున విరిగిపడ్డ చెట్లు

బీజేపీ నేతలపై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం

సికింద్రాబాద్ లో గుడ్ ఫ్రైడే ప్రత్యేక ప్రార్థనలు
.jpg)
మెటుపల్లి లో వాక్ఫ్ బోర్డ్ కు వ్యతిరేకంగా ముస్లింల భారీ ర్యాలీ.

విడిసి చొరవతో... రాలిన "దడువత్" డబ్బులు - ఆరేండ్ల సమస్యకు లభించిన "పరిష్కారం"
