మురుగు నీటిలో కూర్చుండి కాంగ్రెస్ నేత నిరసన
మురుగు నీటిలో కూర్చుండి కాంగ్రెస్ నేత నిరసన
సికింద్రాబాద్, జనవరి 24 ( ప్రజామంటలు) :
బన్సీలాల్ పేట డివిజన్ మేకలమండి లో డ్రైనేజీ పనుల కోసం నిధులు మంజూరీ అయి, పనులు చేయడానికి కాంట్రాక్టర్ సిద్దంగా ఉన్నప్పటికీ అధికారులు పనులు ప్రారంభించడానికి జాప్యం చేయడంపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం డివిజన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఐత చిరంజీవి మేకలమండి గాంధీనగర్ రహదారిలోని రోడ్డుపై పొంగి పారుతున్న డ్రైనేజీ మురుగునీటిలో కూర్చుండి నిరసన వ్యక్తం చేశారు. స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ వచ్చే మంగళవారం కొబ్బరికాయ కొట్టి పనులు ప్రారంభిస్తారని బల్దియా అధికారులు చెప్పడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అప్పటివరకు స్థానికులు మురుగునీరు, దుర్వాసన, దోమల మద్య ఉండాలా...అని అడిగారు. పనుల నిర్వహణకు రూ 19.5 లక్షలు మంజూరు అయ్యాయన్నారు. వెంటనే జీహెచ్ఎమ్సీ కమిషనర్ స్పందించి, పనులు ప్రారంభించి, స్థానిక ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని చిరంజీవి కోరారు. రాష్ర్టంలో ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉందన్న భ్రమలో ఉన్న అధికారులు ఇప్పటికైన తమ వైఖరిని మార్చుకోవాలన్నారు. కార్యక్రమంలో డివిజన్ కాంగ్రెస్ నాయకులు సాయి సందీప్, కే.రాజశేఖర్,సందీప్, మదురవీరన్,మునీర్,హరి,ఆశీష్,సుధాకర్ పాల్గొన్నారు.