ప్రజా ఉద్యమాల వీరుడు చెప్యాల ప్రభాకర్
ప్రభాకర్ యాదిలో ఏరుకొండ నరసింహస్వామి
భీమదేవరపల్లి ప్రజామంటలు జనవరి 23 :
జీవితంలో చివరి వరకు అలుపెరుగకుండా నమ్మిన సిద్ధాంతం కోసమే పనిచేసిన ఉద్యమకారుడు చెప్యాల ప్రభాకర్. ఆయన ప్రసంగం ఒక్కసారి వింటే చాలు, ఎవ్వరికైనా తనతో దోస్తాని చేయాలనిపిస్తుంది. తనతో ముచ్చటిస్తుంటే అంబేద్కర్ రచనలు కళ్ళ ముందు కదలాడుతుండేవి.
రైతులతో రైతులాగా, కూలీ లతో కూలీలాగా, విద్యార్థులతో విద్యార్థిలాగా, కార్మికులతో కార్మికుడిలాగా, ఉపా ధ్యాయులు, మేధావులతో అధ్యయనశీలిగా తాను నమ్మిన సిద్ధాంతాంపై మాట్లా డుతూ, ఘర్షణ లేకుండా అందరినీ ఒప్పించి, మెప్పించే వాడు. ఈ తత్వమే ఆయనను అన్ని వర్గాల వారికీ దగ్గర చేసి అభిమానించేలా చేసింది.
ప్రభాకర్ అంబేద్కర్ సంఘాల నిర్మాణంలోను, పోరాటాలలోను క్రియాశీల పాత్ర పోషించాడు. భీమదేవరపల్లి మం డలంలోని అన్ని గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలు నెలకొల్పడానికి అవిశ్రాంతం గా కృషి చేశాడు.
కారంచేడు, నీరుకొండ, చుండూరు, పదిరికుప్పం లాంటి సంఘటనలు, అమ్మాయిలపై అఘాయిత్యాలు, నాటి ఉమ్మడి, నేటి తెలంగాణలో దళిత, బహుజనులను సమీకరించి ధర్నాలు, రాస్తా రోకోలు చేశాడు. అగ్రకులాలకు, బహుజనులకు, దళితులకు మధ్య ఎక్కడ ఘర్షణ తలెత్తినా తన మాటలు, చేతలతో వారి నడుమ స్నేహపూర్వక వాతావరణాన్ని నెలకొల్పేవాడు.
దళితులపట్ల తప్పు చేసిన అగ్రకులాల వారికి అండగా నిలబడ్డ ఏ పోలీస్ అధికారికి శిక్ష పడకుండా ఆయన వదలలేదు. అందుకే, సమస్యలు వచ్చినప్పుడు తప్పకుండా అతడిని అధికారులుకూడా పిలి చి సామరస్యపూర్వకంగా పరిష్కరించమని కోరేవారు. దీన్నిబట్టి, ఆయనపట్ల వాళ్ళకున్న విశ్వాసాన్ని అర్థం చేసుకోవచ్చు. బ్రాహ్మణిజాన్ని ఎంతగా వ్యతిరే కించేవాడో బ్రాహ్మణులతో ముఖ్యంగా కొత్తకొండ బ్రాహ్మణులతో అంతే స్నేహంతో మెదిలాడు.
అగ్రకులాధిపత్యా న్ని ఎంతగా వ్యతిరేకించే వాడో అందరు అగ్రకుల పెద్దలతో అంతే స్నేహంగా ఉం డడం అతనికే సాధ్యమైంది. హుస్నాబా ద్, భీమదేవరపల్లి, హుజురాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, ముఖ్యంగా పాత కరీంనగర్ జిల్లా అంతటా కలెదిరిగి ‘బహుజన్ సమాజ్ పార్టీ’ పాత కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాడు. బీఎస్పీని విస్తృ తం చేసి 1999 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎల్ఏగా పోటీ చేసే స్థాయికి ఎదిగాడు.
ఆకాంక్ష కోసం జైలుకు..
తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీల ఏర్పాటులో అనేక మిలిటెంట్ పోరాటాలలో అనుభవం ఉన్న మండల జేఏసీ చైర్మన్ సారయ్యతో కలిసి అనేక పోరాటాలకు రూపకల్పన చేశాడు. తను జేఏసీలో జిల్లాస్థాయి బాధ్యతల్లో పనిచేశాడు. రాత్రిపూట జరిగే ‘తెలంగాణ జాగరణ సభ’లన్నింటిలో పాల్గొని ప్రజలను చైత న్య పరిచేవాడు.
2010 జనవరి 15న కొత్తకొండ జాతరలో జరిగిన ధూంధాం సభలో తాను చేసిన ప్రసంగం లక్షలమందిలో తెలంగాణ స్ఫూర్తిని నింపింది. ఇను పరాతి గుట్టల పరిరక్షణకై జరిగిన ఉద్యమంలో సారయ్య సార్‌తో కలిసి ప్రభా కర్ కీలక భూమిక పోషించాడు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను జాతీయ స్థాయిలో పతాకానికి చేర్చాడు. ఆనాటి అనేక కేసులను మోయడమేకాదు, జైలుశిక్ష కూడా అనుభవించాడు.
అనుభవాలు పుస్తక రూపంలో...
ప్రభాకర్ మంచి రచయిత. తన ఆలోచనలను, 45 ఏళ్ళ ఉద్యమ అనుభవా లను అక్షరబద్ధం చేయడానికి పూనుకున్నాడు. ఒక పుస్తకంగా తెచ్చే ప్రయత్నం జరగాల్సి ఉంది. ప్రభాకర్ మంచి హాస్యప్రియుడు కూడా. సందర్భాన్నిబట్టి పలు వురిని కడుపుబ్బ నవ్వించేవాడు. భీమదేవరపల్లి మండలంలోని ధర్మారంలో నిరుపేద మాదిగ కుటుంబంలో జన్మించాడు. జ్యోతిని ఇష్టపడి వివాహం చేసు కున్నాడు.
ఆమె అంగన్వాడీ టీచర్‌గా కొనసాగుతూనే గాయకురాలిగా పాటలు పాడేవారు. జ్యోతి క్యాన్సర్‌తో బాధ పడే వేళ ఆమెను బతికించుకోవడానికి ప్రభాకర్ చేసిన కృషి అంతా ఇంతా కాదు. 2023 అక్టోబర్ 23న ఆమె ఈ లోకాన్ని వదిలి వెళ్లింది.
తర్వాత స్వల్పకాలంలోనే ప్రభాకర్‌కు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. దళిత బహుజన వర్గాల కోసం నిరంత రం పరితపించిన ఆయన హృదయం ఈనెల 14న హఠాత్తుగా ఆగిపోయింది. ప్రభాకర్ అస్తమయం తీరని లోటు. తన ఆశయాలను కొనసాగించడమే ఆయనకు మనమిచ్చే ఘన నివాళి.
*డా.ఏరుకొండ నరసింహుడు 9701007666*