ప్రజా ఉద్యమాల వీరుడు చెప్యాల ప్రభాకర్

ప్రభాకర్ యాదిలో ఏరుకొండ నరసింహస్వామి

On
ప్రజా ఉద్యమాల వీరుడు  చెప్యాల  ప్రభాకర్

భీమదేవరపల్లి ప్రజామంటలు జనవరి 23 :

జీవితంలో చివరి వరకు అలుపెరుగకుండా నమ్మిన సిద్ధాంతం కోసమే పనిచేసిన ఉద్యమకారుడు చెప్యాల ప్రభాకర్. ఆయన ప్రసంగం ఒక్కసారి వింటే చాలు, ఎవ్వరికైనా తనతో దోస్తాని చేయాలనిపిస్తుంది. తనతో ముచ్చటిస్తుంటే అంబేద్కర్ రచనలు కళ్ళ ముందు కదలాడుతుండేవి.

రైతులతో రైతులాగా, కూలీ లతో కూలీలాగా, విద్యార్థులతో విద్యార్థిలాగా, కార్మికులతో కార్మికుడిలాగా, ఉపా ధ్యాయులు, మేధావులతో అధ్యయనశీలిగా తాను నమ్మిన సిద్ధాంతాంపై మాట్లా డుతూ, ఘర్షణ లేకుండా అందరినీ ఒప్పించి, మెప్పించే వాడు. ఈ తత్వమే ఆయనను అన్ని వర్గాల వారికీ దగ్గర చేసి అభిమానించేలా చేసింది.

ప్రభాకర్ అంబేద్కర్ సంఘాల నిర్మాణంలోను, పోరాటాలలోను క్రియాశీల పాత్ర పోషించాడు. భీమదేవరపల్లి మం డలంలోని అన్ని గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలు నెలకొల్పడానికి అవిశ్రాంతం గా కృషి చేశాడు.

కారంచేడు, నీరుకొండ, చుండూరు, పదిరికుప్పం లాంటి సంఘటనలు, అమ్మాయిలపై అఘాయిత్యాలు, నాటి ఉమ్మడి, నేటి తెలంగాణలో దళిత, బహుజనులను సమీకరించి ధర్నాలు, రాస్తా రోకోలు చేశాడు. అగ్రకులాలకు, బహుజనులకు, దళితులకు మధ్య ఎక్కడ ఘర్షణ తలెత్తినా తన మాటలు, చేతలతో వారి నడుమ స్నేహపూర్వక వాతావరణాన్ని నెలకొల్పేవాడు.

దళితులపట్ల తప్పు చేసిన అగ్రకులాల వారికి అండగా నిలబడ్డ ఏ పోలీస్ అధికారికి శిక్ష పడకుండా ఆయన వదలలేదు. అందుకే, సమస్యలు వచ్చినప్పుడు తప్పకుండా అతడిని అధికారులుకూడా పిలి చి సామరస్యపూర్వకంగా పరిష్కరించమని కోరేవారు. దీన్నిబట్టి, ఆయనపట్ల వాళ్ళకున్న విశ్వాసాన్ని అర్థం చేసుకోవచ్చు. బ్రాహ్మణిజాన్ని ఎంతగా వ్యతిరే కించేవాడో బ్రాహ్మణులతో ముఖ్యంగా కొత్తకొండ బ్రాహ్మణులతో అంతే స్నేహంతో మెదిలాడు.

అగ్రకులాధిపత్యా న్ని ఎంతగా వ్యతిరేకించే వాడో అందరు అగ్రకుల పెద్దలతో అంతే స్నేహంగా ఉం డడం అతనికే సాధ్యమైంది. హుస్నాబా ద్, భీమదేవరపల్లి, హుజురాబాద్, సిరిసిల్ల, జగిత్యాల, ముఖ్యంగా పాత కరీంనగర్ జిల్లా అంతటా కలెదిరిగి ‘బహుజన్ సమాజ్ పార్టీ’ పాత కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశాడు. బీఎస్‌పీని విస్తృ తం చేసి 1999 అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఎల్‌ఏగా పోటీ చేసే స్థాయికి ఎదిగాడు.

ఆకాంక్ష కోసం జైలుకు..

తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీల ఏర్పాటులో అనేక మిలిటెంట్ పోరాటాలలో అనుభవం ఉన్న మండల జేఏసీ చైర్మన్ సారయ్యతో కలిసి అనేక పోరాటాలకు రూపకల్పన చేశాడు. తను జేఏసీలో జిల్లాస్థాయి బాధ్యతల్లో పనిచేశాడు. రాత్రిపూట జరిగే ‘తెలంగాణ జాగరణ సభ’లన్నింటిలో పాల్గొని ప్రజలను చైత న్య పరిచేవాడు.

2010 జనవరి 15న కొత్తకొండ జాతరలో జరిగిన ధూంధాం సభలో తాను చేసిన ప్రసంగం లక్షలమందిలో తెలంగాణ స్ఫూర్తిని నింపింది. ఇను పరాతి గుట్టల పరిరక్షణకై జరిగిన ఉద్యమంలో సారయ్య సార్‌తో కలిసి ప్రభా కర్ కీలక భూమిక పోషించాడు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షను జాతీయ స్థాయిలో పతాకానికి చేర్చాడు. ఆనాటి అనేక కేసులను మోయడమేకాదు, జైలుశిక్ష కూడా అనుభవించాడు.

అనుభవాలు పుస్తక రూపంలో...

ప్రభాకర్ మంచి రచయిత. తన ఆలోచనలను, 45 ఏళ్ళ ఉద్యమ అనుభవా లను అక్షరబద్ధం చేయడానికి పూనుకున్నాడు. ఒక పుస్తకంగా తెచ్చే ప్రయత్నం జరగాల్సి ఉంది. ప్రభాకర్ మంచి హాస్యప్రియుడు కూడా. సందర్భాన్నిబట్టి పలు వురిని కడుపుబ్బ నవ్వించేవాడు. భీమదేవరపల్లి మండలంలోని ధర్మారంలో నిరుపేద మాదిగ కుటుంబంలో జన్మించాడు. జ్యోతిని ఇష్టపడి వివాహం చేసు కున్నాడు.

ఆమె అంగన్‌వాడీ టీచర్‌గా కొనసాగుతూనే గాయకురాలిగా పాటలు పాడేవారు. జ్యోతి క్యాన్సర్‌తో బాధ పడే వేళ ఆమెను బతికించుకోవడానికి ప్రభాకర్ చేసిన కృషి అంతా ఇంతా కాదు. 2023 అక్టోబర్ 23న ఆమె ఈ లోకాన్ని వదిలి వెళ్లింది.

తర్వాత స్వల్పకాలంలోనే ప్రభాకర్‌కు ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. దళిత బహుజన వర్గాల కోసం నిరంత రం పరితపించిన ఆయన హృదయం ఈనెల 14న హఠాత్తుగా ఆగిపోయింది. ప్రభాకర్ అస్తమయం తీరని లోటు. తన ఆశయాలను కొనసాగించడమే ఆయనకు మనమిచ్చే ఘన నివాళి.

*డా.ఏరుకొండ నరసింహుడు 9701007666*

Tags

More News...

Local News 

ఘనంగా సూర్య నారాయణ స్వామి కళ్యాణ వేడుకలు.

ఘనంగా సూర్య నారాయణ స్వామి కళ్యాణ వేడుకలు. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349494/9348422113).  జగిత్యాల ఫిబ్రవరి 4( ప్రజా మంటలు ) :  చింతకుంట చెరువు సమీపంలోని సూర్య భగవాన్ ధనలక్ష్మి,సహిత ధన్వంతరి దేవాలయంలో రథసప్తమి వేడుకలలో భాగంగా పద్మిని,ఛాయా సమేత శ్రీ సూర్యనారాయణ స్వామి కళ్యాణం, అంగరంగ వైభవంగా జరిగింది. ఉదయం సూర్యనారాయణ స్వామికి క్షీరాభిషేకం, ఫల పంచామృత అభిషేకం,...
Read More...
National  Local News  State News 

బీఆర్ఎస్ పార్టీ తరపున రైతు కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం.

బీఆర్ఎస్ పార్టీ తరపున రైతు కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి 4 (ప్రజా మంటలు) :  లింగన్న పంట రుణం మాఫీ కాక అప్పులు తీరిక మనస్తాపంతో 15 రోజుల క్రితం చేనులోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ పార్టీ రైతు ఆత్మహత్యల అధ్యయనం కమిటీ చైర్మన్ మాజీ...
Read More...
Local News 

ఘనంగా ఎల్లమ్మ పట్నాలు పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా.బోగ శ్రావణి.

ఘనంగా ఎల్లమ్మ పట్నాలు పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా.బోగ శ్రావణి. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల ఫిబ్రవరి 4 (ప్రజా మంటలు) :  రూరల్ మండలం జాబితాపూర్ గ్రామంలో నిర్వహించిన ఎల్లమ్మ పట్నాలు మరియు బోనాలు జాతర మహోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల నియోజకవర్గం ఇంచార్జ్ డా. బోగ శ్రావణి. ఈ కార్యక్రమంలో జాబితపూర్...
Read More...
National  Local News  State News 

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పాలాభిషేకం. - బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి పాలాభిషేకం. - బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు భోగ శ్రావణి. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  జగిత్యాల ఫిబ్రవరి 4 (ప్రజా మంటలు) భారతీయ జనతా పార్టీ జగిత్యాల నియోజకవర్గం శాఖ ఆధ్వర్యంలో పేద మరియు మధ్యతరగతి వర్గాలను బలపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా మంగళవారం స్థానిక తహశీల్ చౌరస్తా లో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేక నిర్వహించి...
Read More...
National  State News 

పాత పన్ను విధానం రద్దుపై నిర్మలా సీతారామన్ స్పష్టీకరణ 

పాత పన్ను విధానం రద్దుపై నిర్మలా సీతారామన్ స్పష్టీకరణ  పాత పన్ను విధానం రద్దుపై నిర్మలా సీతారామన్ స్పష్టీకరణ  న్యూ ఢిల్లీ ఫిబ్రవరి 04: కొత్త పన్ను విధానం మరింత ఆకర్షణీయంగా తీసుకొస్తున్న.. తరుణంలో పాత పన్ను విధానం రద్దు చేసే అవకాశం ఉందని పుకార్లు పుడుతున్నాయి. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. పాత పన్ను విధానం రద్దు చేస్తారనే వార్తల్లో...
Read More...
Local News 

అవినాష్​ కాలేజీ ఎదుట బీఆర్​ఎస్​వీ ఆందోళన

అవినాష్​ కాలేజీ ఎదుట బీఆర్​ఎస్​వీ ఆందోళన అవినాష్​ కాలేజీ ఎదుట బీఆర్​ఎస్​వీ ఆందోళన      *  దళిత విద్యార్థికి న్యాయం చేయాలని డిమాండ్ సికింద్రాబాద్​, ఫిబ్రవరి 04 ( ప్రజామంటలు ) : సికింద్రాబాద్ ఎస్​డీ రోడ్డు లోని అవినాష్​ కాలేజీ ఎదుట మంగళవారం బీఆర్​ఎస్​వీ నాయకులు ఆందోళన నిర్వహించారు.  కాలేజీ గేట్​ వద్ద బైఠాయించి, డిగ్రీ  విద్యార్థి రాహుల్​ కు న్యాయం చేయాలని...
Read More...

సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీచే బహుమతుల ప్రధానం

సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీచే బహుమతుల ప్రధానం సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీచే బహుమతుల ప్రధానం హన్మకొండ ఫిబ్రవరి 04: చిన్నారుల్లో ఉన్న కళలను ప్రోత్సహించడానికై, సాగంటీస్ ఆర్ట్స్ అకాడమీ ప్రతి నెల నిర్వహించే డ్రాయింగ్ పోటీలు నిర్వహిస్తుంది.అందులో భాగంగా "సంక్రాంతి పండుగ" అంశం తో నిర్వహించారు. పోటీల్లో పాల్గొని బహుమతులు గెలుపొందిన వారికి బహుమతులు అంది,స్తూ చిన్నారుల్లో ఉన్న కళల్ని తల్లిదండ్రులు ప్రోత్సహించాలని, చదువు...
Read More...
Local News 

ఆలయ మాజీ చైర్మన్ కు మాతృవియోగం

ఆలయ మాజీ చైర్మన్ కు మాతృవియోగం ఫిబ్రవరి 4 (ప్రజామంటలు) భీమదేవరపల్లి : కొత్తకొండ వీరభద్ర స్వామి దేవస్థానం ఉత్సవ కమిటీ చైర్మన్ కొమురవెల్లి చంద్రశేఖర్ గుప్తా తల్లి మణెమ్మ మంగళవారం వయోభారంతో శివైక్యం చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి మృతికి గల కారణాలను తెలుసుకొని, మణెమ్మ పార్థివ దేవానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. నివాళులు...
Read More...
Local News 

కడుపునొప్పి బరించలేక,ఆర్థిక బాధలతో  ఆత్మహత్య 

కడుపునొప్పి బరించలేక,ఆర్థిక బాధలతో  ఆత్మహత్య  కడుపునొప్పి బరించలేక,ఆర్థిక బాధలతో  ఆత్మహత్య  ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి 4 (ప్రజా మంటలు): డబ్బా గ్రామానికి చెందిన నునావత్ సునీత  ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ, ఆరోగ్య పరిస్థితులు బాగలేకపోయినా, కడుపునొప్పి భరించలేక ఆత్మహత్య చేసుకున్నట్లు పోల్డఇసుల్బ్బాu తెలిపారు. ఎనిమిది సం .లో క్రితం భర్తతట్నo విడాకులు తీసుకొని, డబ్బా గ్రామంలోని తన అన్నదమ్ముల స్థలంలో రేకుల షెడ్డు...
Read More...
Local News 

సిపిఎస్ యూనియన్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఇన్నారెడ్డి నామినేషన్ దాఖలు

సిపిఎస్ యూనియన్ ఎమ్మెల్సీ అభ్యర్థి ఇన్నారెడ్డి నామినేషన్ దాఖలు సీపీఎస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు స్థితప్రజ్ఞ
Read More...
Local News 

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య

ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య గొల్లపల్లి ఫిబ్రవరి 04 (ప్రజామంటలు) గొల్లపల్లి మండలములోని శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన చొప్పరి తిరుపతి గత కొన్ని రోజుల నుంచి ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతు జీవతం పై విరక్తి చెంది సోమవారము రాత్రి 8 గంటల ఇంట్లో ఎవరూ లేని సమయం డిష్ వైరుతొ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని భార్య చొప్పరి గంగాలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు...
Read More...
Local News 

క్యాన్సర్ పై విద్యార్థులకు అవగాహన సదస్సులు

క్యాన్సర్ పై విద్యార్థులకు అవగాహన సదస్సులు గొల్లపల్లి ఫిబ్రవరి 04 (ప్రజామంటలు) : గొల్లపెల్లి మండలంలోని అంగన్వాడీ కేంద్రాలలో ప్రపంచ క్యాన్సర్ నివారణ దినోత్సవ సందర్భంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా దమ్మన్నపేట చిలువ్వకోడూర్ హైస్కూల్లో బాల బాలికలకు క్యాన్సర్ పై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ జ్యోతి, హైస్కూల్ ఉపాధ్యాయులు లక్ష్మీబాయి, అంగన్వాడీ టీచర్లు లావణ్య,...
Read More...