మధ్యాహ్న భోజన పథకం లో పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లులు ఇవ్వాలి - వర్కర్స్ యూనియన్ వినతి పత్రం
మధ్యాహ్న భోజన పథకం లో పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లులు ఇవ్వాలి - వర్కర్స్ యూనియన్ వినతి పత్రం
మెట్టుపల్లి జనవరి 20( ప్రజా మంటలు)
తెలంగాణ రాష్ట్ర ఏఐటీయూసీ అనుబంధ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో పెరిగిన ధరలకు అనుగుణంగా బిల్లులు ఇవ్వాలని మెట్పల్లిలోని మండల విద్యాశాఖ అధికారికి మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ వారు వినతిపత్రం ఇచ్చారు.
అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు వారానికి మూడుసార్లు కోడిగుడ్లు ఇవ్వాలని ఆదేశించారు, వీటి ధర ఒక కోడి గుడ్డుకు 5/ రూపాయల చొప్పున ఇస్తామన్నారు కానీ మార్కెట్ ధర రూ:లు 8/ గా ఉన్నాయి, దీనికి అదనంగా 3/ రూ: నష్టపోతున్నామన్నారు కావున మార్కెట్ ధరలకు అనుకూలంగా కోడిగుడ్డు ధరలు లేనందువలన విద్యార్థులకు అందించలేమని ప్రభుత్వమే పూర్తిగా కోడిగుడ్లను సరఫరా చేయాలన్నారు, అలాగే ప్రభుత్వం చెల్లిస్తామన్న రూ:10,000 వేతనం వెంటనే చెల్లించాలి, మెనూ చార్జీలు ప్రతి విద్యార్థికి రూ: 25/ చెల్లించాలి, వంట సందర్భంలో జరుగుతున్న ప్రమాదాలకు జీవిత బీమా సౌకర్యం కల్పించాలి, గత 9 నెలలుగా పెండింగ్లో ఉన్న బిల్లులు చెల్లించాలన్నారు, ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకుడు ఎండి ఉస్మాన్, మధ్యాహ్న భోజన వర్కర్స్ పి సులోచన, కే సరస్వతి, లావణ్య, గంగు, భారత, శారద, భూమన్న, సాలమ్మ తదితరులు పాల్గొన్నారు,