అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలి
ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్
జగిత్యాల జనవరి 20( ప్రజా మంటలు )
అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ అన్నారు.
జిల్లాలో 14 వార్డులో 60 లక్షలతో, 15 వ వార్డులో 20 లక్షలతో, 31
వార్డులలో 20 లక్షలతో మొత్తంగా 1 కోటి రూపాయలతో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. అనంతరం 14వ వార్డులో ఎస్సై కమ్యూనిటీ హాల్ భవనాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ గుర్తించారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ..
అర్హతగల రేషన్‌కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి ఇది నిరంతర ప్రక్రియగా కొనసాగుతోంది. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
పట్టణంలో ఇంటింటి ఫీల్డ్ సర్వేయర్ వార్డు ఆఫీసర్ సిబ్బంది క్షేత్రస్థాయిలో పరిశీలించి జాబితా రూపొందించాలని సూచించారు. అర్హతగల ప్రతి కుటుంబానికి రేషన్‌కార్డు అందించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు.
మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ..
జగిత్యాల పట్టణాభివృద్దికి నిరంతర కృషి చేస్తున్నామని, జగిత్యాలను ఆదర్శంగా తీర్చిదిద్దడమే తమ ధ్యేయమని పేర్కొన్నారు.
ప్రజా ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్దిని కాంక్షిస్తోందని, దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమం, అభివృద్ది పథకాలను ముఖ్యమంత్రి రెడ్డి చేపట్టారని, ముఖ్యమంత్రి సహకారంతో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చొరవ చూపి జగిత్యాల అభివృద్దికి నిధులు మంజూరు చేశామన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాగభూషణం, చిరంజీవి, కౌన్సిలు కూతురు పద్మ (శేఖర్), మళ్ళీకార్జున్, ఆజార్, బాలే శంకర్, ఏఈ శరణ్, కౌన్సిలర్లు నాయకులు, ఆయా వార్డుల ప్రజలు, అధికారులు, అధికారులు ఉన్నారు.