మాతృభాష రక్షణతోనే జాతి సాంస్కృతిక వారసత్వ రక్షణ
మాతృభాష రక్షణతోనే జాతి సాంస్కృతిక వారసత్వ రక్షణ
నార్సింగి (హైదరాబాద్) జనవరి 19:
భాష మనిషి అస్తిత్వానికి ప్రతీక .మాతృభాష రక్షణతోనే
జాతి సాంస్కృతిక వారసత్వ రక్షణకు స్థిరత్వం ఏర్పడుతుందని మేధావులు' రచయితలు తెలుగు భాష
వికిసానికి విస్తరణకు కృషి చెయ్యాల్సిన తరుణం ఆసన్న
మైందని తెలంగాణ ఎడ్యుకేషన్ ఫోరం ' తెలంగాణ ఎకానమిక్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు నేదునూరి కనకయ్య అన్నారు.
తెలుగు భాష రక్షణలో తెలుగు పండుగలు' ఆచార సాంప్రదాయాల 'విస్తరణలో సుస్థిరతలో మేధావులు రచయితలు క్రియాశీలక పాత్ర పోషించాలని తెలంగాణ ఎడ్యుకేషన్ తెలంగాణ ఎకనామిక్ ఫోరం అధ్యక్షుడు నేదునూరి కనకయ్య అభిప్రాయపడ్డారు.
నేడు హైదరాబాద్లో నార్సింగ్ ఓం కన్వెన్షన్ లో తెలుగు సంగమం ఆధ్వర్యంలో జరిగిన సంక్రాంతి సమ్మేళనం
2025 కార్యక్రమానికి అతిథిగా హాజరైన తెలంగాణ ఎకానమిక్ ఫోరం తెలంగాణ ఎడ్యుకేషన్ ఫోరం అధ్యక్షుడు నేదునూరి కనకయ్య మాట్లాడుతూ తెలుగు భాష మాట్లాడం తెలుగు పండుగలు సంక్రాంతి సంబరాలు గంగిరెద్దుల ప్రదర్శన తెలుగు వంటకాలు రుచులు ప్రపంచానికి చాటి భారత్ ను ప్రపంచ గుర్తింపును తెచ్చి విశ్వగురువు స్థాయికి చేర్చుతాయని అభిప్రాయపడ్డారు.
ఈ కార్యక్రమంలో కాకులారం కృష్ణ దేవేంద్రరావు వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.
కార్యక్రమంలో గంగిరెద్దుల ప్రదర్శన సాంస్కృతిక కార్యక్రమాలు సంస్కృతి ఆధ్యాత్మికత ఉట్టిపడే పాటలు పాడుతూ సభికులను అలరించారు.
నేదునూరి కనకయ్య
9440245771