ధర్మపురిలో కళ్యాణ లక్ష్మీ, సి ఎం అర్ ఎఫ్ చెక్కుల పంపిణీ
ధర్మపురిలో కళ్యాణ లక్ష్మీ, సి ఎం అర్ ఎఫ్ చెక్కుల పంపిణీ
ధర్మపురి జనవరి 15:
ధర్మపురి పట్టణ కేంద్రంలోనీ స్థానిక ఎంపిడిఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కళ్యాణ లక్ష్మీ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గురువారం రోజున పాల్గొన్నారు.ఈ సందర్భంగా సుమారు 75 లక్షల రూపాయల విలువగల 75 కళ్యాణ లక్ష్మీ షాదిముబారక్ చెక్కులను అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు
అనంతరం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని 24 లక్షల 11 వేల 5వందల రూపాయల విలువ గల 82 సిఏంఆర్ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు పంపిణి చేసారు.
*అనంతరం మీడియాతో మాట్లాడుతూ, కళ్యాణ లక్ష్మీ చెక్కులను అందుకున్న లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిజేస్తున్నామని,ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి ఆగస్టు నెల నుండి డిసెంబర్ నెల వరకు 8కోట్ల 35 లక్షల 25 వేల 5 వందల రూపాయల విలువ గల 3706 సిఎంఆర్ఎఫ్ చెక్కులను,1 కోటి 59 లక్షల 25 వేల రూపాయల విలువ గల 85 LOC లను,10 కోట్ల 10 లక్షల 18 వేల 812 రూపాయల విలువ గల 1061 కళ్యాణ లక్ష్మీ,షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని,రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చు కుంటూ ముందుకు వెళ్లడం జరుగుతుందని, ఈ నెల 26 నుండి ఇందిరమ్మ ఇళ్లు,నూతన రేషన్ కార్డుల జారి,రైతు భరోసా వంటి అమలు చేస్తామని,ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ విషయంలో గ్రామ సభను ఏర్పాటు చేసి అర్హులైన లబ్దిదారులకు మాత్రమే ఇళ్లను పంపిణీ చేస్తామని ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.