ఎమ్మెల్యే సంజయ్ పై కౌశిక్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు ఖండించిన ఐఎంఏ సభ్యులు
జగిత్యాల జనవరి 15 (ప్రజా మంటలు)
జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పై గత ఆదివారం హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కరీంనగర్ లో చేసిన అనుచిత వ్యాఖ్యలు మరియు అనుచిత ప్రవర్తన ఘటనపట్ల ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జగిత్యాల శాఖ ఖండించింది.
ఈ సందర్భంలో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ను బుధవారం మధ్యాహ్నం ఒంటిగంట ప్రాంతంలో అసోసియేషన్ జగిత్యాల శాఖ కార్యవర్గ సభ్యులు, వైద్యబృందం దరూర్ క్యాంపులోని mla క్వార్టర్ లో కలిసి సంఘీభావం తెలిపారు.
ఎమ్మెల్యే సంజయ్ ప్రజలు మెచ్చుకొనే నాయకుడు, వైద్యుడు డా. సంజయ్ కుమార్ పట్ల తోటి శాసనసభ్యుడు కౌశిక్ రెడ్డి ప్రవర్తించిన తీరు ప్రజాస్వామ్యంలో సరి అయ్యింది కాదన్నారు.ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు.
డాక్టర్ జి హేమంత్, డాక్టర్ ఎ శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ శశికాంత్ రెడ్డి, డాక్టర్ జి శ్రీలత, డాక్టర్ రజిత, డాక్టర్ సుధీర్ కోటగిరి, డాక్టర్ ఉదయ్ గౌడ్, డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ శ్రీనివాస్, డాక్టర్ నవీన్, డాక్టర్ ప్రవీణ్, డాక్టర్ చింతా రమేష్, డాక్టర్ రాంబాబు తదితరులు ఉన్నారు.