పార్టీ ఫిరాయింపులను ప్రశ్నిస్తే అరెస్టా? ఎమ్మెల్సీ కవిత
పార్టీ ఫిరాయింపులను ప్రశ్నిస్తే అరెస్టా?
రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టును ఖండించిన ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్ : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అక్రమ అరెస్టు చేయడాన్ని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా ఖండించారు.
పార్టీ ఫిరాయింపులను ప్రశ్నిస్తే అరెస్టు చేస్తారా అని నిలదీశారు. రాజ్యాంగ విలువలకు, ప్రజాస్వామిక స్ఫూర్తికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తూట్లు పొడుస్తున్నారని మండిపడ్డారు. ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్యం కాపాడుతామంటూ ఊదరగొట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు.
ఇలాంటి అక్రమ నిర్బంధాలకు భయపడే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. అక్రమ అరెస్టులతో బీఆర్ఎస్ కార్యకర్తలను, నాయకులను భయపెట్టలేరని స్పష్టం చేశారు. ఎన్ని ఇబ్బందులు పెట్టినా ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని నిలదీస్తూనే ఉంటామని అన్నారు.
తక్షణమే ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి విడుదల చేయాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.