సంస్కృతి మేళవించే పండుగ సంక్రాంతి ఆర్డీవో మధుసూదన్
జగిత్యాల జనవరి13(ప్రజా మంటలు )
మన సంస్కృతి,సంప్రదాయాల మేళవించే పండుగసంక్రాంతి అని జగిత్యాల డివిజన్ ఆర్డీవో పి.మధుసూదన్ అన్నారు.తెలంగాణ ఆల్ సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో అసోసియేషన్ ఆధ్వర్యంలో భోగి,సంక్రాంతి పండుగల సందర్భంగా గత వారం రోజులుగా ముగ్గుల పోటీలు,వేగపు నడక,చదరంగం,క్యారం పోటీలు ,వయోవృద్ధుల సంరక్షణ చట్టం పై అవగాహన సదస్సు నిర్వహించారు.
కౌన్సెలింగ్ కేంద్రం ఆవరణలో పోటీల్లో గెలిచిన విజేతలకు ,విశిష్ట సీనియర్ సిటీజెన్లకు,మహిళలకు జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో ఆర్డీవో చేతుల మీదుగా బహుమతులు అందజేసి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ నాటి కాలపు ఆత్మీయతలను,అనుబంధాలను పెంచడానికి సీనియర్ సిటీజేన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ ఆధ్వర్యంలో ప్రతి ఏటా సంక్రాంతి పండుగ సంబరాలను నిర్వహించడం ఆదర్శనీయమన్నారు.
సీనియర్ సిటీజేన్స్ జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఆధ్వర్యంలో జగిత్యాల ఆర్డీవో పి.మధుసూదన్,కోరుట్ల ఆర్డీవో జీవాకర్ రెడ్డి,మెట్ పల్లి ఆర్డీవో శ్రీనివాస్ లు వయోవృద్ధుల కేసులను సత్వరం పరిష్కరిస్తుండడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమాల్లో సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి,జిల్లా అధ్యక్షుడు హరి ఆశోక్ కుమార్, ఐ.సి.ఐ.సి.ఐ.బ్యాంక్ డిప్యూటీ మేనేజర్ శ్రావణి,పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్ ఆలేఖ్య,సీనియర్ సిటీజేన్స్ జిల్లా ప్రధాన కార్యదర్శి గౌరిశెట్టి విశ్వనాథం,కోశాధికారి వెల్ముల ప్రకాష్ రావు,ఉపాధ్యక్షులు పి.సి.హన్మంత రెడ్డి,ఎం.డి.యాకూబ్,ఆర్గనైజింగ్ కార్యదర్శులు పి.ఆశోక్ రావు,కే.సత్యనారాయణ,సంయుక్త కార్యదర్శులు దిండిగాల విఠల్,రాజ్ గోపాల చారి,బి.కరుణ,కోరుట్ల అధ్యక్షుడు పబ్బా శివానందం,కార్యదర్శి జి.రాజ్ మోహన్,మెట్ పల్లి అధ్యక్షుడు వొజ్జల బుచ్చిరెడ్డి,కార్యదర్శి సౌడాల కమలాకర్,కోశాధికారి వి.ప్రభాకర్ రావు,ఉపాధ్యక్షుడు ఎం.స్వామి,ధర్మపురి అధ్యక్షుడు కండ్లే గంగాధర్,మల్యాల అధ్యక్షుడు దేవా రెడ్డి,మేడిపల్లి అధ్యక్షుడు గోవర్దన్ రావు,కథలపూర్ అధ్యక్షుడు విద్యాసాగర్ రావు,కార్యదర్శి అల్లూరి బాపు రెడ్డి, మహిళా జేఏసి నాయకురాళ్లు గంగం జలజ,సింగం పద్మ,బక్కశేట్టి లక్ష్మి , సీనియర్ సిటీజేన్స్ నాయకురాళ్లు విజయ లక్ష్మి,దేవేంద్రమ్మ,మంగమ్మ,,తదితరులు పాల్గొన్నారు.