తెలంగాణ అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా నడవాలి - సీఎం రేవంత్ రెడ్డి 

On
తెలంగాణ అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా నడవాలి - సీఎం రేవంత్ రెడ్డి 

తెలంగాణ అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా నడవాలి - సీఎం రేవంత్ రెడ్డి 
మాజీ గవర్నర్ సాగర్ జీ ఆత్మకథ పుస్తక ఆవిష్కరణ 
రేవంత్ రెడ్డి చేపట్టిన పథకాలు గొప్పవి - సాగర్ జీ

హైదరాబాద్‌ జనవరి 12:

తెలంగాణ అభివృద్ధి కోసం పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా నడవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిIMG-20250112-WA0758 అన్నారు. కేంద్రం నుంచి  రాష్ట్రానికి రావలసిన, కావలసిన నిధులను తెచ్చుకోవడంలో అందరూ సహకరించాలని కోరారు.

  మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు (సాగర్ జీ) ఆత్మకథ ‘ఉనిక’ పుస్తకాన్ని ముఖ్యమంత్రి  ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, హైదరాబాద్‌ను విశ్వ నగరంగా తీర్చిదిద్దాలంటే మెట్రో రైలు, రీజినల్ రింగ్ రోడ్డు, రీజినల్ రింగ్ రైల్ వంటి ప్రాజెక్టులు అవసరమని అన్నారు.

మహారాష్ట్ర మాజీ గవర్నర్ చెన్నమనేని విద్యాసాగర్ రావు (సాగర్ జీ) మాట్లాడుతూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన హైడ్రా, మూసి సుందరీకరణ లాంటి పథకాలు ఎంతో గొప్పవని, ఆయన తెలంగాణ అభివృద్ధికి కృషిచేస్తున్నాడని ప్రశంసించారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,హైదరాబాద్ మెట్రో దేశంలోనే రెండో స్థానంలో ఉండగా, గడిచిన పదేళ్లలో ఎలాంటి ప్రగతి లేని కారణంగా 9 వ స్థానానికి పడిపోయిందని, కేంద్ర మంత్రిమండలి రాబోయే సమావేశంలో మెట్రో విస్తరణకు ఆమోదముద్ర పడేలా నాయకులు చొరవ చూపాలని కోరారు.

 తెలంగాణ అభివృద్ధిని ఇప్పుడు విస్మరిస్తే మరెప్పుడూ ముందుకుపోలేమని అన్నారు. దేశాన్ని 5 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా తయారు చేయడంలో తెలంగాణ వంతు సహకరించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రధానమంత్రి గారికి చెప్పానని, ఆ సాధన దిశగా తెలంగాణలో అభివృద్ధి పనులకు కేంద్రం సహకరించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు.

తెలంగాణకు పోర్టు లేని కారణంగా డ్రైపోర్టుకు అనుమతి ఇవ్వాలని, అలాగే సమీపంలోని బందరు రేవుకు కనెక్టివిటీ ఉండాలన్న విషయాన్ని కూడా ప్రధాని దృష్టికి తెచ్చామన్నారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని అంశాన్ని కూడా ప్రధాని సహకారం కోరామని, ఇలాంటి విషయాల్లో తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రులు, ఎంపీలు సహకరించాలని కోరారు.

 తెలంగాణలో 60 శాతం ఆదాయం హైదరాబాద్ నగరం నుంచే వస్తోందని, హైదరాబాద్ దేశంలోని ఏ ఇతర నగరాలతో కాకుండా న్యూయార్క్, టోక్యో వంటి నగరాలతో పోటీ పడుదామని చెప్పారు.

తమిళనాడులో రాజకీయంగా ఎన్ని వైరుధ్యాలు ఉన్నప్పటికీ రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో సమిష్టిగా పనిచేస్తారని ఉదహరిస్తూ తెలంగాణ అభివృద్ధికి అన్ని రాజకీయ పార్టీలు సహకరించాలని ముఖ్యమంత్రి కోరారు.

 తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు ముందుండి పోరాటాలు చేశారని గుర్తుచేస్తూ ప్రత్యేక రాష్ట్రంలో ఉన్నామంటే విద్యార్థులు రాజకీయాల్లో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించడమేనని అన్నారు.

 విద్యార్థి దశలో సిద్దాంతపరమైన రాజకీయాలు చేస్తే పార్టీకి కట్టుబడి ఉంటారని, అలాంటి రాజకీయాలను పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. రాజకీయాల్లో రాణించాలని భావించే వారు "ఉనిక" పుస్తకాన్ని చదవాలని అన్నారు.

చట్టసభల్లో ప్రభుత్వ వైఫల్యాలను ప్రతిపక్షం ఎత్తి చూపించాలని, కాలక్రమేణా  ప్రజాస్వామ్య స్ఫూర్తిని కోల్పోతున్నామని, ప్రజాస్వామిక స్ఫూర్తిని ప్రదర్శించాలన్న ఉద్దేశంతోనే గత 13 నెలల్లో జరిగిన అసెంబ్లీ తీరుతెన్నులే ఉదహారణగా చెప్పారు.

 ఉత్తర తెలంగాణ ప్రాంతం సస్యశ్యామలం కావాలంటే గోదావరి జలాలు తీసుకురావాలని సాగర్ జీ పాదయాత్ర చేశారని, అలాగే గోదావరి జలాల వినియోగం కోసం వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రాణహిత, చేవెళ్ల ప్రాజెక్టును తీసుకొచ్చారని అన్నారు.

 గోదావరి జలాల వినియోగంపై సాగర్ జీ సలహాలు, సూచనలు ఎంతో అవసరమని, మహారాష్ట్రలో మునుగుతున్న భూములకు సంబంధించిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడమని గతంలో నేను సాగర్ జీని కోరిన విషయాన్ని ముఖ్యమంత్రి  ప్రస్తావించారు.

తనకు భేషజాలు లేవని, తెలంగాణ కోసం ఎవరినైనా కలుస్తా, అందరి సహకారం తీసుకుంటానని అన్నారు. సాగర్ జీ గవర్నర్‌గా మహారాష్ట్ర, తమిళనాడు రెండు రాష్ట్రాల్లో సమర్థవంతంగా పనిచేసి తెలంగాణ గౌరవాన్ని నిలబెట్టారు.

 విద్యార్థుల్లో నైపుణ్యం పెంచడం కోసం రాష్ట్రంలో 75 ఐటీఐలను ఏటీసీలుగా మార్చడం, ఆనంద్ మహీంద్రా నేతృత్వంలో Young India Skills University ఏర్పాటు, దాని ఆవశ్యకత, క్రీడల అభివృద్ధికి స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ అకాడమీ వంటి పలు కీలక అంశాలను వేదిక నుంచి ముఖ్యమంత్రి  వివరించారు.

 ఈ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, ఒడిసా గవర్నర్ కే. హరిబాబు, కేంద్ర మంత్రి బండి సంజయ్, రాష్ట్ర మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, ఎంపీ కే. లక్ష్మణ్ , మాజీ ఎంపీలు టీ. సుబ్బిరామిరెడ్డి , బి.వినోద్ కుమార్  ఇతర సీనియర్ నాయకులు, పాత్రికేయులు పాల్గొన్నారు.

Tags

More News...

Local News  State News 

మకర సంక్రాంతికి మోడీ జీ మరచిపోలేని బహుమతి, ఇచ్చిన మాట నిలపెట్టుకున్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్.

మకర సంక్రాంతికి మోడీ జీ మరచిపోలేని బహుమతి, ఇచ్చిన మాట నిలపెట్టుకున్న నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల జనవరి 14 (ప్రజా మంటలు) : ఈ రోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో స్థానిక తహసిల్ చౌరస్తాలో నిజమాబాద్ కేంద్రంగా పసుపు బోర్డ్ ఏర్పాటు చేసిన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరియు నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది,...
Read More...
Local News 

ఘనంగా కురుమ సంఘం చే బీరప్పకు బోనం సమర్పణ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ.

ఘనంగా కురుమ సంఘం చే బీరప్పకు బోనం సమర్పణ నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల జనవరి 14 (ప్రజా మంటలు) :  మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా మంగళవారం బీరప్ప ఆలయం వద్ద పట్టణ కురుమ సంఘం ఆధ్వర్యంలో బోనం సమర్పించారు. ఈ కార్యక్రమంలో పట్టణ ప్రచార కార్యదర్శి చెట్టి నరసయ్య మాట్లాడుతూ.... తమ కులదైవం బీరప్ప స్వామి అని తొలి...
Read More...
Local News 

రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా వాహనదారులకు రోడ్డు నిబంధనలపై అవగాహన.

రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా వాహనదారులకు రోడ్డు నిబంధనలపై అవగాహన. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). జగిత్యాల జనవరి 14 (ప్రజా మంటలు) : రోడ్డు భద్రత మాసోత్సవాలలో భాగంగా మంగళవారం జిల్లా కేంద్రంలో వాహనదారులకు రోడ్డు భద్రత గూర్చి అవగాహన కల్పించారు. వాహనం నడిపేటప్పుడు హెల్మెట్ ధరించాలని అదేవిధంగా సీట్ బెల్ట్ ధరించాలని, డ్రైవింగ్ చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని వివరించారు. ఈ కార్యక్రమంలో...
Read More...
Local News  State News 

శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఘనంగా గోదా రంగనాథ కళ్యాణ వేడుకలు.

శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో ఘనంగా గోదా రంగనాథ కళ్యాణ వేడుకలు. (సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).  జగిత్యాల జనవరి 14 (ప్రజా మంటలు) :  జిల్లా కేంద్రంలోని శ్రీ వేణుగోపాల స్వామి ఆలయంలో మంగళవారం రాత్రి 8 గంటలకు గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై వేంచేపు చేసి కళ్యాణాన్ని కొనసాగించారు....
Read More...
Local News 

మూగబోయిన ఉద్యమ గొంతుక చెప్యాల ప్రభాకర్

మూగబోయిన ఉద్యమ గొంతుక చెప్యాల ప్రభాకర్ భీమదేవరపల్లి జనవరి 15 (ప్రజామంటలు) : తెలంగాణ ఉద్యమకారుడు, మంచి వక్త చెప్యాల ప్రభాకర్ హఠాన్మరణం భీమదేవరపల్లి మండలంలో విషాదాన్ని నింపింది. తెలంగాణ యాస, మండలంలోని గ్రామాల్లో తన మాటలతో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లిన మాటల మాంత్రికుడు ఇకలేరన్న వార్త.. తెలంగాణ ఉద్యమకారులను తీవ్రంగా కలిచి వేసింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో ఆయనకు విడదీయరాని అనుబంధం...
Read More...
Local News 

మల్లన్న పేటలో మకర సంక్రాంతి ముగ్గుల పోటీ  నిర్వహించిన ఆవారి చందు

మల్లన్న పేటలో మకర సంక్రాంతి ముగ్గుల పోటీ  నిర్వహించిన ఆవారి చందు మల్లన్న పేటలో మకర సంక్రాంతి ముగ్గుల పోటీ నిర్వహించిన ఆవారి చందు గొల్లపల్లి జనవరి 13 (ప్రజా మంటలు): గొల్లపల్లి మండలం మల్లన్నపెట లో సంక్రాంతి పండుగా సందర్భంగా యువ నాయకుడు ఆవారి చందు ఆధ్వర్యంలో  ఆడపడుచులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్వయం కృషితో ఎదిగి,మహిళా లోకానికి ఆదర్శం అయినటువంటి...
Read More...
Local News  State News 

ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు

ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డికి బెయిల్‌ మంజూరు కరీంనగర్ జనవరి 14:  ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డిపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తో పాటు మరో ఇద్దరు పెట్టిన కేసులో కరీంనగర్ కోర్టు బెయిల్మం జూరు చేసింది.మూడు కేసుల్లో బెయిల్‌ మంజూరు చేసిన జడ్జిరూ.25 వేల చొప్పున రెండు పూచీకత్తులు ఇవ్వాలని ఆదేశంసమీక్షా...
Read More...

ప్రపంచవ్యాప్త బౌద్ధ సన్యాసులచే ఒడిశా లో సన్యాసి గురు పద్మసంభవ జప కార్యక్రమం

ప్రపంచవ్యాప్త బౌద్ధ సన్యాసులచే ఒడిశా లో సన్యాసి గురు పద్మసంభవ జప కార్యక్రమం ప్రపంచవ్యాప్త బౌద్ధ సన్యాసులచే ఒడిశా లో సన్యాసి గురు పద్మసంభవ జప కార్యక్రమం బుభనేశ్వర్ జనవరి 14: ప్రపంచవ్యాప్తంగా 1200 మందికి పైగా బౌద్ధ సన్యాసులు ఒడిశాలో జరిగే మొదటి గురు పద్మసంభవ జప కార్యక్రమంలో పాల్గొనడానికి సమావేశమవుతున్నారు. జనవరి 13 ఆదివారం ప్రారంభమై జనవరి 16 వరకు కొనసాగే మొదటి గురు పద్మసంభవ జప...
Read More...
National  International   State News 

మరోసారి స్టాక్ మార్కెట్లు కుప్పకూలడంతో రూ.13 లక్షల కోట్ల ప్రజాధనం ఆవిరి

మరోసారి స్టాక్ మార్కెట్లు కుప్పకూలడంతో రూ.13 లక్షల కోట్ల ప్రజాధనం ఆవిరి సోమవారం రోజున మరోసారి స్టాక్ మార్కెట్లు కుప్పకూలడంతో రూ.13 లక్షల కోట్ల ప్రజాధనం ఆవిరి ముంబాయి జనవరి 14: శివవరం స్టాక్ మార్కెట్ లో అంతా నష్టాలే చవి చూశారు. దాదాపు 13 లక్షల కోట్ల ప్రజా దానం ఆవిరి అయిపోయింది.ముగింపు సమయానికి సెన్సెక్స్ 1,049 పాయింట్లు (1.36%) తగ్గి 76,330 వద్ద స్థిరపడింది,...
Read More...
National  Local News  State News 

నేడు జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం

నేడు జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం నేడు జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభం జాతీయ పసుపు బోర్డు చైర్మన్‌గా గంగారెడ్డి నియామకం నిజామాబాద్ జనవరి 14:నిజామాబాద్‌లో పసుపు బోర్డు కార్యాలయం ఏర్పాటులోవర్చువల్‌గా  కేంద్రమంత్రి గోయల్‌ పాల్గొననునన్నారు.పసుపు బోర్డు చైర్మన్‌గా అవకాశం రావడం నా అదృష్టంపసుపు రైతుల చిరకాల కలను కేంద్రం నెరవేర్చిందని,  జాతీయపసుపుబోర్డు చైర్మన్బోర్డు...
Read More...
Local News  State News 

కేసీఆర్ క్షమాపణ చెపితే నేను రాజీనామా చేస్తా -  జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ 

కేసీఆర్ క్షమాపణ చెపితే నేను రాజీనామా చేస్తా -  జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్  కేసీఆర్ క్షమాపణ చెపితే నేను రాజీనామా చేస్తా -  జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్    కరీంనగర్ జనవరి 14: గతంలో జరిగిన పరిణామాలపై కెసిఅర్ క్షమాపణ చెబితే తాను రాజీనామా చేయడానికి సిద్ధమని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్  స్పష్టం చేశారు కరీంనగర్ లో పోలీస్ స్టేషన్ వద్దకు కాంగ్రెస్ నాయకులతో కలిసి...
Read More...

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాలు జారీ 

తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాలు జారీ  తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి మార్గదర్శకాలు జారీ  హైదరాబాద్ జనవరి 13:సంక్రాంతి పండుగ వేళ తెలంగాణలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజలకు శుభ వార్త తెలిపింది. తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల మంజూరుకు సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. దీంతో దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న ఉన్న వినతుల పరిష్కారం...
Read More...