వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం
వజ్ర సంకల్పం ఉన్న యువత ఈ దేశానికి అవసరం
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా.భోగ శ్రావణి ప్రవీణ్,
పాల్గొన్న మున్సిపల్ ఛైర్పర్సన్ ఆడువాల జ్యోతి
జగిత్యాల జనవరి 12 (ప్రజా మంటలు):
దేశ ఖ్యాతిని నాలుగు దిశల చాటి చెప్పిన స్వామి వివేకానంద జయంతి మరియు జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా స్థానిక జగిత్యాల పట్టణంలోని 45వ వార్డులో గల స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలవేసి బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల్ నియోజకవర్గం ఇంచార్జ్ Dr. బోగ శ్రావణి నివాళులర్పించారు.ఈ విగ్రహాన్ని మాజీ కౌన్సిలర్ కొమురవెల్లి లక్ష్మీనారాయణ నెలకొల్పారు.
ఈ సందర్భంగా డాక్టర్ బోగ శ్రావణి మాట్లాడుతూ, భారతదేశ ఖ్యాతిని మన సాంప్రదాయాలను ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద భారతదేశంలోనూ, పాశ్చాత్య దేశాలలోనూ తన గురువు రామకృష్ణ పరమహంస పేరు మీదుగా రామకృష్ణ మిషన్, రామకృష్ణ మఠాలను స్థాపించి ఎందరో విద్యావంతులను సమాజసేవకు అంకితం చేశారనీ అన్నారు.
యువతకు స్ఫూర్తిగా,మార్గనిర్దేశకుడిగా నిలిచిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అతని వాగ్దాటికి ముద్దులైన అమెరికా ప్రజలను బ్రహ్మరథం పట్టింది, అనతి కాలంలోనే స్వామీజీకి ప్రపంచ ప్రఖ్యాతి లభించింది, మరియు ఆయన ఎన్నో దివ్య ప్రబోధాలను మనకు అందించారు,"కెరటం నాకు ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు పడినా కూడా లేస్తున్నందుకు ""ఆరంభం అతి స్వల్పంగా ఉంటుందని నిరాశ పడవద్దు ఘనమైన ఫలితాలు సక్రమంగా సమకూరుతాయి సాహసాన్ని ప్రదర్శించండి అని ఎన్నో గొప్ప ప్రబోధలు మనకు అందించిన స్వామి వివేకానంద జయంతి జనవరి 12న పురస్కరించుకుని ఆయన చెప్పిన గొప్ప మాటల్ని గుర్తు చేసుకుంటూ వారి జయంతి సందర్భంగా వారికి నివాళులర్పించడం నా అదృష్టంగా భావిస్తున్నానని బోగ శ్రావణి అన్నారు.
ఈ కార్యక్రమంలో జగిత్యాల పట్టణ మున్సిపల్ చైర్మన్ అడువాల జ్యోతి, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్ మరియు స్థానిక వార్డ్ కౌన్సిలర్లు,మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబారి కళావతి, పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు దూరిసెట్టి మమత, పుష్ప రెడ్డి మామిడాల కవిత, సింగం పద్మ, భానుప్రియ, మధురిమ, బద్దెల గంగరాజం,బోగ రాజు, మామిడాల రాజగోపాల్, సిరిపురం చంద్రశేఖర్, శ్రీనివాస్ మరియు తదితరులు పాల్గొన్నారు.