తెలంగాణ అన్నవరంగా పిలవబడుతున్న గూడెం సత్యనారాయణ స్వామివారి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాను. - పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశి కృష్ణ.

On
తెలంగాణ అన్నవరంగా పిలవబడుతున్న గూడెం సత్యనారాయణ స్వామివారి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాను. - పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశి కృష్ణ.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

మంచిర్యాల నవంబర్ 24 (ప్రజా మంటలు)  : 

దండపల్లి మండలం గూడెం రమా సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకున్న పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశి కృష్ణ.

పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ అర్చకులు,అధికారులు

శాలువాతో సత్కరించి తీర్థప్రసాదాలు అందజేసిన ఆలయ అర్చకులు..

దర్శనానంతరం ఎంపీ వంశీ మాట్లాడుతూ....

మొట్టమొదటిసారిగా గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి వారిని దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను.

1964 లో స్వయంభు వెలసిన స్వామి వారి ఆలయానికి లక్షల మంది భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకోవడం గొప్ప విషయం

కోరిన కోరికలు తీర్చే దేవుడిగా సత్యనారాయణ స్వామి విరాజిల్లుతున్నాడు ఈ ఆలయం ఇంకా అభివృద్ధి కావాల్సి ఉంది...అభివృద్ధి కోసం నా ఎంపి ఫండ్స్ నుంచి నా వంతు సహకారం అందిస్తాను.

తెలంగాణ అన్నవరంగా పిలవబడుతున్న గూడెం సత్యనారాయణ స్వామివారి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తాను.

సత్యనారాయణ స్వామి ఆశీస్సులు మన అందరిపై ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.

Tags