జాతీయ రహదారి. భూ సర్వే పనులు త్వరగా పూర్తి చేయాలి -జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.
జాతీయ రహదారి. భూ సర్వే పనులు త్వరగా పూర్తి చేయాలి
-జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్.
కోరుట్ల అక్టోబర్ 23 :
NH 63 నిర్మాణం కోసం చేస్తున్న భూ సేకరణ పనులను అధికారులు సమన్వయంతో త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ సత్యప్రసాద్ సూచించారు.
బుధవారం రోజున కోరుట్ల మండలంలోని మోహనరావుపేట్, గ్రామ సమీపంలోని , మరియు జగిత్యాల మండలంలోని తాటి పల్లి శివారులో జాతీయ రహదారుల అధారిటీ అధికారులు చేస్తున్న సర్వేను పరిశీలించి. పెండింగ్లో ఉన్న పనులను సకాలంలో పూర్తి చేయాలని, రోడ్డు నిర్మాణంలో రైతులు, ప్రజలు ఇబ్బంది పడకుండా చేపట్టాలని సూచించారు.
ఈ సందర్భంగా జాతీయ రహదారి నిర్మాణంలో కోల్పోతున్న భూమి, ఇండ్లు, కట్టడాలు, బోర్లు, పైపులైన్లు, ఇతర నిర్మాణాలను పరిశీలించి, వాటికి చెల్లించాల్సిన నష్ట పరిహారం అంచన విలువలను ఆయాశాఖల అధికారులు సమన్వయంతో కలిసి పూర్తి చేయాలన్నారు.
ఇప్పటి వరకు చేపట్టిన సర్వేలో భూములు కోల్పోతున్న వారు తెలిపిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకొని భూ సేకరణలో ఎదురవుతున్న ఇబ్బందులకు అనుసరించాల్సిన విధానాలను వివరించారు.
కార్యక్రమంలో ఆర్టీవో శ్రీనివాస్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.