గల్ఫ్ పేరిట గాలిలో కలిసిన మరో కార్మికుడు
గల్ఫ్ పేరిట గాలిలో కలిసిన మరో కార్మికుడు
హైదారాబాద్ ఆగస్టు 27:
జగిత్యాల జిల్లా, మెట్పల్లి మండలం,ఆత్మా నగర్ గ్రామానికి చెందిన వేములవాడ రాజు అనే యువకుడు మొదట దుబాయ్ వెళ్లి కంపెనీ సరియైన జీతము ఇవ్వకపోవడం వలన తిరిగి స్వదేశానికి వచ్చి అప్పులు పెరిగిపోవడం వలన మళ్లీ తిరిగి దువా కత్తర్ వెళ్లి అక్కడ పనిచేస్తుండగా ఆరోగ్యం సహకరించకపోవడం వలన తిరిగి తన గ్రామమైన ఆత్మా నగర్ రావడం జరిగింది ఆర్థిక ఇబ్బందుల వలన 15 రోజుల క్రితం అప్పులు పెరిగిపోవడం వలన ఇంట్లో ఎవరూ లేని సమయంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాద సంఘటన చాలా విచారకరం గల్ఫ్ కార్మికుడు వేములవాడ రాజు కు ఒక కొడుకు రేశ్వంత్ కూతురు రిషిత నాలుగు సంవత్సరాల పాప వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఉన్నారు ప్రభుత్వము గల్ఫ్ కార్మికుని కుటుంబాన్ని ఆదుకొని మృతదన ఆర్థిక సాయం అందించాలని ప్రవాస మిత్ర లేబర్ యూనియన్ యూ ఏ ఈ దుబాయ్ అధ్యక్షులు బత్తిని రాజా గౌడ్ ప్రభుత్వాన్ని కోరారు. గల్ఫ్ మృతుల కుటుంబాలను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వము గల్ఫ్ బోర్డు ఏర్పాటుచేసి ఐదు లక్షల ఎక్స్గ్రేషియా చెల్లించాలని గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి ఐదు కోట్ల వార్షిక సహాయనిధి కేటాయించాలని ప్రవాస భారతీయ భీమా యోజన పథకం లో సహజ మరణం కూడా చేర్చి పదిలక్షల విలువైన ప్రమాద బీమా గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు అందే విధంగా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ప్రవాసమిత్ర లేబర్ యూనియన్ యూఏఈ దుబాయ్ అధ్యక్షుడు బత్తిని రాజా గౌడ్ కోరారు.