అర్హులైన ప్రతి ఒక్కరికి రుణమాఫీ వస్తుంది. - మంత్రి పొన్నం ప్రభాకర్.
భీమదేవరపల్లి ఆగస్టు 20 (ప్రజామంటలు) :
భీమదేవరపల్లి మండలంలోని కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో మంగళవారం మంత్రి పోన్నం ప్రభాకర్ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు ఏక కాలంలో రెండు లక్షల రైతు రుణమాఫీ చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వందేనని రవాణా బీసీ, సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హర్షం వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు రైతాంగాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని రైతులు బిఆర్ఎస్,బీజేపీ చట్రంలో పోవద్దని సూచించారు.
ఇప్పటి వరకు రెండు లక్షల వరకు రైతు రుణమాఫీ పూర్తి అయిందని, ఎవరికైనా రుణమాఫీ కాకపోతే రైతాంగం ఆందోళన చెంద వద్దని మండల కార్యాలయాల్లో వ్వవసాయ అధికారులను కలసి అప్లికేషన్ ఇవ్వాలని సూచించారు. వారు పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికీ రుణమాఫీ అమలు అయ్యేలా చూస్తారని పేర్కొన్నారు.
రైతు రుణమాఫీ 2018 డిసెంబర్ 12 కంటే మందు,2023 డిసెంబర్ 9 తరువాత లోన్ తీసుకున్న వారిని రుణమాఫీ వర్తించదని పేర్కొన్నారు.బిఅర్ఎస్ 10 ఏళ్లలో లక్ష రూపాయల రుణమాఫీ ఎన్ని విడతల చేశారు.?ఎంత మంది కి ఇచ్చారు.అని ప్రశ్నించారు.బిఅర్ఎస్ హయంలో లక్ష రూపాయలు రైతు రుణమాఫీ విడతల వారిగా చేయడానికి 5 సంవత్సరాలు పట్టింది.మాటమీద నిలబడే ప్రభుత్వం మాది ఒకేసారి రుణమాఫీ చేసి మాటన నిలబెట్టుకున్నం,అది తెలంగాణ రైతాంగం మెుత్తానికి ఒకే దశలో రైతు రుణమాఫీ పూర్తి చేశామని తెలిపారు.
పూజ కార్యక్రమంలో పాల్గొన్న వారు అలయ ఈవో పి కిషన్ రావు,ఉప ప్రధానార్చకులు కే రాజయ్య,ముఖ్య అర్చకులు రాంబాబు,అర్చకులు శ్రీకాంత్,రమేష్,వినయ్ శర్మ,సందీప్,చంద్ర శివకుమార్,శ్రావణ్,గురు ప్రసాద్,నక్షత్ర దీక్ష స్వాములు భక్తులు పాల్గొన్నారు.