దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చరిత్రలో మొట్ట మొదటిసారిగా ఒకే రోజులో భారీ స్థాయిలో 2263 మంది ఉద్యోగులకు పదోన్నతులు
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
హైదరాబాద్ 18 ఆగస్టు (ప్రజా మంటలు) :
TGSPDCL లో భారీ స్థాయిలో పదోన్నతులు...
2017 నుండి పెండింగ్ లో వున్న పదోన్నతులకు ఈరోజు మోక్షం...
పదోన్నతుల వలన ఏర్పడిన ఖాళీల భర్తీ కి నిర్ణయం తీసుకునే అవకాశం..
దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ చరిత్రలో మొట్ట మొదటిసారిగా ఒకే రోజులో భారీ స్థాయిలో 2263 మంది ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తూ సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ముషారఫ్ ఫరూఖీ ఐఏఎస్ ఆదేశాలు జారీ చేసారు.
ఇంజినీరింగ్ సర్వీస్ లో 101; అకౌంట్స్ సర్వీస్ లో 47; O&M సర్వీస్ లో 2099; P&G సర్వీస్ లో 16 మంది అధికారులకు సిబ్బందికి పదోన్నతులు లభించాయి.
ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క ఈ నెల 8 వ తేదీన దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణి సంస్థ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
ఆ సమీక్షా లో పాల్గొన్న పలువురు అధికారులు 2017 నుండి పెండింగ్ లో వున్న పదోన్నతుల గురించి గౌరవ ఉప ముఖ్య మంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. ఎన్నో ఏళ్లుగా పదోన్నతులకు నోచుకోని ఉద్యోగుల నైతిక స్థైర్యం దెబ్బతింటున్న విషయాన్ని గ్రహించిన ఉప ముఖ్య మంత్రి పెండింగ్ లో వున్న పదోన్నతులకు సంభందించిన కార్యాచరణను వెంటనే ప్రారంభించాల్సిందిగా సీఎండీ ముషారఫ్ ఫరూఖీ ని ఆదేశించడం జరిగింది.
వాస్తవానికి 2017 నుండి పదోన్నతులు పెండింగ్ లో ఉండటం మూలంగా, అర్హులైన చాలా మంది పదోన్నతులు పొందకుండానే రిటైర్ అయ్యారు.
2263 మంది సిబ్బందికి పదోన్నతుల వలన ఖాళి అయిన పోస్టుల భర్తీ కి సైతం రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలననుసారం చర్యలు తీసుకుంటామని సీఎండీ తెలిపారు.
2017 నుండి, అంటే దాదాపుగా ఏడున్నరేళ్లుగా పదోన్నతుల కోసం ఎదురుచూస్తున్న ఉద్యోగులకు భారీ స్థాయిలో పదోన్నతులకు ఆమోదం తెలిపి అదేశాలు ఇప్పించిన సందర్భంగా గౌరవ ముఖ్య మంత్రి, గౌరవ ఉప ముఖ్య మంత్రి కి మరియు సంస్థ సీఎండీ లకు విద్యుత్ ఉద్యోగులు అధికారులు పాలాభిషేకం చేసి తమ ఆనందాన్ని తెలియజేసారు.