రైతు సంతోషమే ప్రభుత్వ సంతోషం సీఎం రేవంత్, ఎమ్మెల్సీ జీవన్ చిత్రపటాలకు పాలాభిషేకం
On
రైతు సంతోషమే ప్రభుత్వ సంతోషం
సీఎం రేవంత్, ఎమ్మెల్సీ జీవన్ చిత్రపటాలకు పాలాభిషేకం
జగిత్యాల, జులై 18( ప్రజా మంటలు) : దేశానికి వెన్నెముక రైతు అని ఆ రైతు సంతోషమే ప్రభుత్వ సంతోషమని ఇచ్చిన మాట తప్పని సి.ఎం రేవంత్ రెడ్డి అని మాజీ వైస్ ఎంపిపి గంగం మహేష్ అన్నారు. గురువారం తిప్పన్న పేటలో రైతు రుణమాఫీ అమలు తోలి రోజును పురస్కరించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా మహేష్ మాట్లాడుతూ అప్పుల భాధ నుంచి రైతులను ఒడ్డుకు వేసేందుకే సి ఎం రుణమాఫీ చేపట్టి మాట ప్రకారం అమలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో తిపన్నపేట, గోపాలరావుపేట రైతులు, కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.
Tags