సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ చిత్రపటాలకు పాలాభిషేకం
గొల్లపల్లి ఫిబ్రవరి 05 (ప్రజామంటలు) :
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో బీసీ కులగల బిల్లును ప్రవేశ పెట్టిన సందర్భంగా ఎస్సీ ఉప కులాల వర్గీకరణ కొరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆమోదం తెలిపిన సందర్భంగా గొల్లపల్లి మండల కేంద్రంలో బుదవారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మరియు ప్రభుత్వ విప్ ధర్మపురి శాసనసభ్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ పక్షాన మరియు అదే విధంగా బలహీన వర్గాల పక్షాన ధన్యవాదాలు తెలుపుకుంటూ ఘనంగా పాలభిషేకం నిర్వహించారు అనంతరం మండల అధ్యక్షులు నిశాంత్ రెడ్డి మాట్లాడుతూ బీసీ కులగణన ద్వారా బలహీన వర్గాలకు చెందిన ప్రజలు సామాజిక,ఆర్థిక,విద్య,ఉపాధి,రాజకీయ రంగాలలో ముందుకు వెళ్లడానికి ఈ బిల్లు ఎంతగానో ఉపయోగపడుతుందని వారు తెలిపారు. అదేవిధంగా ఎస్సీ మరియు ఎస్సీ ఉపకులాల వర్గీకరణ కు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం ద్వారా ఎస్సీలలో ఉన్నటువంటి వివిధ కులాల అన్నింటికీ న్యాయం జరుగుతుంది అని చారిత్రాత్మక నిర్ణయాన్ని తీసుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముస్కు నిశాంత్ రెడ్డిమార్కెట్ కమిటీ చైర్మన్ భీమ సంతోష్, వైస్ చైర్మన్ పురపాటి రాజిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ మండల అధ్యక్షులు క్యాస గంగాధర్, మాజీ ఎంపిటిసి లంబ లక్ష్మణ్ ధనవ్వ, పట్టణ అధ్యక్షులు నేరెళ్ల మహేష్ మాజీ సర్పంచులు చిర్ర గంగాధర్ కాసరపు అరవింద్ గౌడ్ ,రేవెల్ల లింగన్న గౌడు కొండ వెంకటేష్ గౌడు అవునూరు శ్రీధర్, ఎమ్మార్పీ అధ్యక్షులు చేవులమద్ది రమేష్, మ్యక స్వామి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు రాపల్లి గంగన్న ,రామ్మోహన్ రావు గురిజల బుచ్చిరెడ్డి , కచ్చు మల్లయ్య,కట్ట లక్ష్మణ్,చిర్ర దిలీప్,విక్రమ్, కంది వెంకటేష్, నల్ల విక్రమ్ రెడ్డి, తిరుపతి నాయకులు తదితరులు పాల్గొన్నారు.