కుల గణన చారిత్రాత్మక నిర్ణయం - సంఘనభట్ల
కుల గణన చారిత్రాత్మక నిర్ణయం - సంఘనభట్ల
-మాట ఇస్తే కాంగ్రెస్ మడమ తిప్పదు
-ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది
-బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యం
ధర్మపురి ఫిబ్రవరి 05:
కాంగ్రెస్ మాట ఇస్తే మడమ తిప్పదని, ఇచ్చిన మాట ప్రకారం కుల గణన, సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించి, ఆ నివేదికను అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవేశపెట్టడం చారిత్రాత్మకమని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సంఘనబట్ల దినేష్ పేర్కొన్నారు. ఫిబ్రవరి 4 సువర్ణ అక్షరాలతో లెక్కించదగ్గ రోజు అని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్తశుద్ధికి నిదర్శనమని ఆన్నారు.
బుధవారం మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ భారత్ జొడో యాత్రలో ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం బిసి కుల గణన,ఏస్సి వర్గీకరణ చేసిన సందర్భంగా పార్లమెంట్ పక్ష నేత రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి,ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చిత్ర పటాలకు పాలాభిషేకం చేశారు.ఈ సందర్భంగా ధర్మపురి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగనభట్ల దినేశ్ గారు మాట్లాడుతూ అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో భాగంగా ప్రభుత్వం సామాజిక, ఆర్థిక, ఉపాధి, విద్య, రాజకీయ, కుల సర్వే -2024 నివేదికను ఇవాళ శాసనసభలో సీఎం రేవంత్, మండలిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టడం హర్షనీయమని పేర్కొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 6 నవంబర్, 2024న ప్రారంభమైన సర్వే 25 డిసెంబర్, 2024 వరకు 50 రోజుల పాటు కొనసాగడం కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు గొప్ప నిదర్శనమని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్,ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ లకు కృతజ్ఞతలు తెలిపారు. మాట ఇచ్చిన సరిగ్గా ఏడాదిలోపు ఈ నిర్ణయం నివేదికగా మారి సభముందుకు వచ్చిందని, ఇది ఓ చరిత్రాత్మక సందర్భం అని పేర్కొన్నారు. సర్వే తయారీలో కాంగ్రెస్ ప్రభుత్వం వివిధ సంఘాలు, మేధావుల అభిప్రాయాలతో పాటు కర్ణాటక, బిహార్ సహా వివిధ సర్వేలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిందని, ఇది ఆషామాషీగా చేసిన సర్వే కాదని పేర్కొన్నారు.
ఈ సర్వే ద్వారా సేకరించిన డేటాను షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులు, రాష్ట్రంలోని ఇతర బడుగు బలహీన వర్గాల సంక్షేమానికి విధానాల రూపకల్పన చేయడానికి ప్రభుత్వం ఉపయోగిస్తుందని తెలిపారు.
సీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పరంగా 42 శాతం టికెట్లు అందిస్తామని ముఖ్యమంత్రి అసెంబ్లీలో ప్రకటించడం హర్షనీయమని పేర్కొన్నారు. పేదల అభ్యున్నతి కాంగ్రెస్ ప్రభుత్వం తోనే సాధ్యమవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు వేముల రాజేశ్,పట్టణ కాంగ్రెస్ అద్యక్షుడు చిపిరిశెట్టి రాజేశ్,ఎస్సి సెల్ కార్యదర్శి చిలుముల లక్ష్మణ్, యూత్ కాంగ్రెస్ నాయకులు అప్పం తిరుపతి, అప్పం శ్రవణ్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ లు రఫియోద్దిన్, పురుషోత్తం గౌడ్,నాయకులు జక్కు రవీందర్, ఎదులపురం మహేందర్, పాల గణేష్,రాపర్తి సాయికిరణ్, ఇఫ్తికర్,కోరుట్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు