కొక్కరకుంటలో శ్రీ బీరప్ప స్వామి ఆలయ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోండి
కొక్కరకుంటలో శ్రీ బీరప్ప స్వామి ఆలయ ఆస్తులను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోండి
కరీంనగర్ ఫిబ్రవరి 05:
కరీంనగర్ ప్రెస్ భవన్ లో జిల్లా కురుమ సంఘం ఆధ్వర్యంలో జిల్లా కురుమ సంఘం అధ్యక్షులు కడారి అయిలయ్య అధ్యక్షతన జరిగిన పత్రికా సమావేశంలో ముఖ్య అతిథులు బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మేకల ప్రభాకర్ మాట్లాడుతూ రామడుగు మండలం కొక్కరకుంట గ్రామంలో కురుమ కులస్తుల ఆరాధ్య దైవం శ్రీ బీరప్ప స్వామి దేవాలయము, ముందు ఉన్న బెస్త బోయిలు మరియు గుడికి వేసిన పందిరి ధ్వంసం చేసి ఎంపీ బండి సంజయ్ గారి నిధులతో వేసిన బోరుబావి, మోటర్ , పైపులు తీసి కరెంటు వైర్లు మోటారును ముక్కలు ముక్కలుగా చేసిపడేసినారు, బోరు మొత్తం కూల్చినారు. కొక్కరకుంట గ్రామానికి చెందిన భూస్వామి ప్రభుత్వ ఉపాధ్యాయుడు తౌటు లింగారెడ్డి, రాంరెడ్డి, నారాయణరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి వీరు అందరూ కలిసి కొందరి కిరాయి దుండగులతొ కలిసి ఫిబ్రవరి 3 న, మళ్ళీ 3న శ్రీ బీరప్ప స్వామి గుడిని కూల్చినారనీ ఆరోపించారు.
ఈ విషయం రామడుగు మండల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా,. న్యాయం కోసం రామడుగు మండలంలోని వెదిర ఎక్స్ రోడ్ లో శాంతియుతంగా నిరసన తెలియ జేసినాము. కానీ రామడుగు మండల పోలీస్ మా ఫిర్యాదుపై పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు.
దేవాలయ ఆస్తులను ధ్వంసం చేసినవారిపై చర్యలు తీసుకొని, మళ్ళీ యథాతథ స్థితి కల్పించాలని, లేనిచో jillaavyapta నిరసనలు, ఆందోళనలు చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
సమావేశంలో జిల్లా కురుమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కర్రే రాజు, రాష్ట్ర కార్యదర్శి ఎలుకపెళ్లి లచ్చయ్య, సహాయ కార్యదర్శి జూలపల్లి రఘునందన్, మేకల నర్సయ్య, ట్రస్ట్ అధ్యక్షులు చిగుర్ల శ్రీనివాస్, జిల్లా కురుమ యువత అధ్యక్షులు కర్రె అనిల్ కుమార్, జిల్లా మహిళా అధ్యక్షురాలు కర్రె పావని, జిల్లా విద్యా కమిటీ అధ్యక్షులు పోలె శ్రీనివాస్, ఒగ్గు బీర్ల కళాకారుల సంఘం జిల్లా అధ్యక్షులు ఒగ్గరి రాజు, కురుమ పంచాయితీ కమిటి జిల్లా అధ్యక్షులు కోరె గట్టయ్య, కురుమ విద్యార్థి సంఘం అధ్యక్షులు సేవల అక్షయ్ కుమార్, విద్యా కమిటీ ప్రధాన కార్యదర్శి దయ్యాల వీరేశం, కర్రె శ్రీనివాస్, కురుమ సంఘం పట్టణ అధ్యక్షులు కర్రె శ్రీనివాస్, జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి పబ్బల వీరయ్య, ఎగుర్ల రాంబాబు, దయ్యాల బీరయ్య, మేకల నారాయణ, ఇరుమల్ల మల్లేశం, నాగం మల్లయ్య, ఏముండ కనకయ్య , నాగం బీరయ్య , ఏముండ నర్సయ్య , ఏముండ లచ్చయ్య నాగం సంపత్ తదితరులు పాల్గొన్నారు