ప్రజావాణికి జన ప్రభంజనం - ప్రజావాణిలో 12, 459 దరఖాస్తులు
ప్రజావాణికి జన ప్రభంజనం - ప్రజావాణిలో 12, 459 దరఖాస్తులు
రికార్డు స్థాయిలో ప్రజావాణిలో దరఖాస్తుల నమోదు
సింహ భాగం ఇందిరమ్మ ఇండ్ల కోసమే
దరఖాస్తులను స్వీకరించిన ప్రజావాణి ఇంచార్జీ చిన్నారెడ్డి, నోడల్ అధికారి దివ్య
హైదరాబాద్ జనవరి 24:
మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 12, 459 దరఖాస్తులు అందాయి. అందులో సింహ భాగం 10, 188 ఇందిరమ్మ ఇండ్ల కోసం వచ్చిన దరఖాస్తులు ఉన్నాయి.
పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు సంబంధించి 252, విద్యుత్ శాఖ కు సంబంధించి 110, రెవెన్యూ పరమైన సమస్యలకు సంబంధించి 51, ప్రవాసి ప్రజావాణికి సంబంధించి 5, ఇతర శాఖలకు సంబంధించి 85 దరఖాస్తులు అందినట్లు అధికారులు తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్లు పథకం కోసం 10, 188 దరఖాస్తులు వచ్చాయి,
రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ చైర్మన్ డాక్టర్. జీ. చిన్నారెడ్డి, స్టేట్ నోడల్ అధికారి అధికారి శ్రీమతి దివ్య ఈ కార్యక్రమంలో పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు. ప్రజాభవన్ కు వచ్చిన వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు.